-పరీక్షల సీజన్ మొదలైంది.
-ఈ నెల 18 నుండి 10వ తరగతి పరీక్షలు
-పరీక్షల వేళల్లో కంటి నిండా నిద్ర….
-పోషకాహారం తీసుకోవాలి
-కొద్దిపాటి చిట్కాలతో పరీక్షల ఒత్తిడిని జయించే అవకాశం
-ఎం ఎస్ అహ్మద్, డైరెక్టర్ సైకాలజీ హబ్ తెలంగాణ, ప్రముఖ సైకాలజిస్ట్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
విద్యార్థిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి సమాజానికి మంచి పౌరుడిని అందించి, జాతి సంపదను సమూన్నతంగా పెంచడానికి ఉపయోగపడే అద్భుతమైన నిచ్చెనలే పరీక్షలు. విద్యార్థి సంవత్సరమంతా చదువుకున్న చదువుకు ఫలితంగా మార్కులనే ధాన్యరాసులు మెమో రూపంలో అందుతాయి. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి పరీక్షల సమయంలో సానుకూల దృక్పదాన్ని అలవర్చుకోవాలి. పరీక్షలు అనే భయం పక్కన పెట్టి నిర్దేశించుకున్న సమయం ప్రకారం చదువుకోవాలి. పరీక్షలు ముగిసే వరకు ఆరోగ్యంపై దృష్టి పెట్టి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఎండల తీవ్రత పెరగడంతో పరిశుద్ధమైన నీటిని తాగుతూ ఉండాలి. నిరంతరాయంగా చదవకుండ ప్రతి 40 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలని ఖమ్మం నగర ప్రముఖ సైకాలజిస్ట్ ఎమ్మెస్ అహ్మద్ సూచిస్తున్నారు. సానుకూల దృక్పథం, విద్యార్థి మెదడు ఇంకా శరీరం చురుగ్గా పని చేయాలంటే పోష్టికాహారం అవసరం. తాజా పండ్లు కూరగాయలు ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. విజయం అనేది కేవలం చదువు మీదనే కాకుండా ఆహారం నిద్ర, విశ్రాంతి, సానుకూల దృక్పథం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సులభంగా జీర్ణం కానీ ఆహారం ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. స్మార్ట్ ప్గోన్, టీవీ, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత తక్కువ సమయం స్క్రీన్ టైంకు వెచ్చించాలి. మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవడానికి సరైన నిద్ర, వ్యాయామం, ధ్యానం వంటి వాటిని ఆచరించాలి. సంగీతం వినడం మిత్రులతో పరిమితమైన సమయం గడపడం మంచిదే.
పరీక్షలు అయ్యేవరకు పునఃశ్చరణ మంత్రం చాలా ఉపయోగపడుతుంది. విషయాలను బట్టి పట్టకుండా అర్థం చేసుకోని చదివితే బాగా గుర్తుంటాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షల వేళ అధిక సమయం కేటాయించి విద్యార్థులలో ధైర్యం నింపాలి. విద్యార్థులను ఇతరులతో పోల్చకూడదు.
పరీక్ష సమయంలో ఏడు గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. పదో తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు మనస్సు ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి. పరీక్షలు ముగిసే వరకు అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు. తల్లిదండ్రులు సైతం పిల్లలకు ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలి. కనీసం 7 గంటల నిద్రపోవాలి. పరీక్షకు గంట ముందుగానే చదవడం మానేసి పరీక్షకు హాజరవ్వాలి. ప్రతిరోజు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి.