👉పదవుల్లో, పరిపాలన పోస్టుల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి
👉జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు సరిదిద్దాలి
👉కేంద్ర మంత్రిగా బీసీకి అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు
☝️బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు
ఈనెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి సమస్త బీసీ సమాజం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు
నేడు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఇతర బీసీ సంఘాలు కుల సంఘాలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు
ఈ సందర్భంగా కేశన శంకర్ రావు మాట్లాడుతూ గత జగన్ రెడ్డి పాలనలో అటెండర్ నుంచి నుండి ఐఏఎస్ వరకు వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు బీసీలకు పాలన పోస్టుల్లో పదవుల్లో తీరని అన్యాయం చేశారన్నారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయం జరగకుండా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని సరిదిద్దుతారని విశ్వాసం బీసీలకు సంపూర్ణంగా ఉందన్నారు
పాలన అధికారుల పోస్టుల్లో , మంత్రివర్గంలో, నామినేటెడ్ పోస్టుల్లో జనాభా దామాష ప్రకారం 50% కోట కల్పించాలని చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు
జగన్ పాలనలో బీసీ అధికారులకు బీసీలకు రాజకీయంగా అన్యాయం జరిగిందనె బిసి సమాజమంతా కూటమితో జతకట్టి బీసీ వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇంటికి పంపించామని అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నుండి నేటి వరకు బీసీలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవం ఇస్తున్నందునే ఈ ఎన్నికల్లో బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డామని ఆయన తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకు ప్రాధాన్యత పోస్టులు ప్రిన్సిపల్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిపార్ట్మెంట్ హెచ్వోడీలు నుండి మొదలుకొని రాజకీయ పదవుల వరకు బీసీలకు పెద్దపీట వేసి సామాజిక న్యాయానికి పాటుపడాలని చంద్రబాబును కోరారు
👉కేంద్ర మంత్రిగా రామునాయుడు కి అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం
కేంద్ర క్యాబినెట్లో దివంగత బీసీ నేత ఎర్రం నాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారికి కేంద్రా క్యాబినెట్ మంత్రిగా అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం వారికి అవకాశం కల్పించిన ప్రధాని మోడీ అలాగే తెదేపా నేత చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని శంకర్రావు అన్నారు
బీసీలకు సముచిత స్థానం గౌరవం కల్పిస్తారని విశ్వాసం భరోసా కేంద్ర క్యాబినెట్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన రామ్మోనాయుడు గారికి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు పార్లమెంటులో బీసీల గలాన్ని వినిపించి తన తండ్రి నుండి తన వరకు బీసీల పక్షాన నిలబడిన రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర క్యాబినెట్ హోదా దక్కడం బీసీల ఆత్మగౌరవానికి నిదర్శనంగా భావిస్తున్నామన్నారు ఇదే వొరవడిని, ఇదే విశ్వాసాన్ని ఇదే నమ్మకాన్ని బీసీలపై చంద్రబాబు ఉంచుతారని బీసీ సమాజం సంపూర్ణంగా విశ్వసిస్తుందని కెసన శంకర్రావు తెలిపారు
ఈ మీడియా సమావేశంలో
(కేసన శంకర్రావు)
రాష్ట్ర అధ్యక్షులు
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం