SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
షేక్ మదార్ సాహెబ్

ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలామ్‌) త్యాగాలకు చిహ్నంగా ముస్లిములు ఏటా బక్రీదు పర్వదినాన్ని జరుపుకుంటారు. హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం బాల్యం నుండి వ ృద్ధాప్యం వరకు అడుగడుగునా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. మరెన్నో త్యాగాలు చేశారు. పుత్రునిగా, భర్తగా, తండ్రిగా, ప్రవక్తగా, విశ్వాసపాత్రుడైన దైవదాసుడుగా ఆయన తన కర్తవ్య నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. దేవుడు పెట్టిన ప్రతీ పరీక్షలోనూ నెగ్గారు.
సరిగ్గా ఐదువేల సంవత్సరాల క్రితం ఇప్పడు మనం ఇరాక్‌ గా పిలుచుకుంటున్న ప్రాంతాన్ని నమ్రూద్‌ చక్రవర్తి పరిపాలించేవాడు. తన దుర్మార్గపు నిర్ణయాలతో ప్రజలు నానా తంటాలు పడేవారు. తానే దేవుడిగా చెలామణి అయ్యేవాడు. గర్వించేవాడు. నమ్రూద్‌ దుర్మార్గ పాలనకు చెరమగీతం పాడాలని ఇబ్రాహీం ప్రవక్త గళం విప్పారు. సమాజంలో పాతుకుపోయి ఉన్న దురాచారాలను, విగ్రహారాధనను వ్యతిరేకించారు. సర్వ సృష్టిని స ృష్టించిన ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఆగ్రహించిన రాజు భగభగ మండే అగ్నిగుండంలో ఇబ్రాహీం (అ)ని పడవేయించాడు. కాని దైవ మహాత్యంతో అగ్నిగుండం పూలపాన్పుగా మారింది. ఈ విషయం తెలుసుకున్న రాజు తన దైవత్వానికి ప్రమాదం పొంచి ఉందని భయపడ్డాడు. ఇబ్రాహీం ను రాజభవనానికి పిలిపించి తీవ్రంగా హెచ్చరించాడు. ‘‘నువ్వు ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నావు. నన్ను మించిన దేవుడెవడూ లేడు’’ అన్నాడు నమ్రూదు. దానికి ఇబ్రాహీం జవాబిస్తూ ‘‘జీవన్మరణాలు ప్రసాదించేవాడే నా ప్రభువు. ఆయనే ఈ సమస్త సృష్టికి స ృష్టికర్త’’ అన్నారు. ఈ మాటలు విన్న నమ్రూద్‌ తన గొప్పదనాన్ని చూపించడానికి ‘‘నేను కూడా జీవితాన్ని ప్రసాదిస్తాను. నేను తలచిన వారిని చంపించగలను. కాబట్టి న ప్రభువు చేసే పని ప్రత్యేకమైనదేం కాదు.’’ అన్నాడు. ఇబ్రాహాం నవ్వుతూ .. ‘‘నా ప్రభువు సూర్యుడిని తూర్పు నుంచి ఉదయించేలా చేస్తున్నాడు. పడమట అస్తమించేలా చేస్తున్నాడు. నువ్వే గనక దేవుడివి అయితే ఈ క్రమాన్ని మార్చి చూపించు’’ అన్నారు. ఇబ్రాహీం మాటలకు నమ్రూద్‌ నోరెళ్లబెట్టాడు. అందరిముందూ సిగ్గుతూ తలదించుకున్నాడు. అక్కడి నుంచి ఇబ్రాహీం వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. మరోపక్క ఇంటి వారినుంచి కూడా ప్రతిఘటన ఎదురైంది. తాతముత్తాతలనాటి దురాచారాలను వదిలేయమన్నందుకు ఇబ్రాహీం తండ్రి ఆజర్‌ ఇబ్రాహీం ను ఇంటినుంచి గెంటివేశారు. యుక్తవయస్సులోనే ఇంటిని, దేశాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. వయసు పై బడుతున్న కొద్దీ తన తదనంతరం దైవ సందేశ కార్యభారాన్ని నిర్వర్తించడానికి సంతానం ఉంటే బాగుండునన్న కోరిక కలిగేది. దైవం పండంటి బిడ్డను ప్రసాదించాడు. లేకలేక కలిగిన బిడ్డనుచూసుకొని ఆ దంపతులు ఎంతగానో మురిసి పోయారు. అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దేవుడాయనకు మరో పరీక్ష పెట్టాడు. భార్యను, కొడుకును జనసంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలేసిరమ్మని ఆదేశించాడు. ఇబ్రాహీం (అస) తన భార్యకు కొన్ని ఎండు ఫలాలు, కొంత నీరు, మరికొన్ని వస్తువులు జనసంచారంలోని ఎడారి ప్రాంతంలో వదిలి తీవ్ర విచారంతో వెనుదిరిగారు. భార్య ఒంటెను పట్టుకుని ‘‘ఇబ్రాహీమ్‌! మమ్మల్ని ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకు వదిలేస్తున్నారు? ‘‘మీకు నా పట్ల ఎలాంటి అభిమానం లేకపోయినా కనీసం మీ కన్న బిడ్డ గురించి ఆలోచించండి. మీ కుమారుడు ఇక్కడ ఆకలి దప్పులతో ప్రాణం వదిలివేయవచ్చు. ఇక్కడ క్రూర మృగాలు మాపై దాడి చేయవచ్చు’’ అని భర్తకు మొరపెట్టుకున్నరు. భర్త ఇబ్రాహీం సహనం వహించాలని ఆమెతో చెప్పారు. ‘తాను, తన ఇష్టప్రకారం వ్యవహరించడం లేదనీ, కేవలం అల్లాప్‌ా ఆదేశాలను అమలు చేస్తున్నామనీ జవాబిచ్చారు. ఆయన జవాబు ఆమెకు ఊరటకలిగించింది. ‘‘ఇది అల్లాప్‌ా అభీష్టమైతే ఆయన మమ్మల్ని ఒంటరిగా వదలిపెట్టడు’’ అని హాజిరా తన్ను తాను ఓదార్చుకున్నారు. తన భార్యాబిడ్డల్ని జనసంచారంలేని ఎడారిలో వదిలి వెళుతున్నందుకు ఇబ్రాహీంలో దుఖాన్ని భరించలేకపోయారు. కళ్లనిండా అశ్రువులతో, బరువెక్కిన గుండెతో తిరుగుప్రయాణమయ్యారు. ‘‘ప్రభూ!నీ పవిత్రమైన గృహానికి దగ్గరగా నిర్జన ప్రదేశంలో నేనూ నా కుటుంబీకులను వదలి వచ్చాను. వారు అక్కడ దైవారాధనను స్థాపించాలని భావిస్తున్నాను. వారిపట్ల సానుభూతి, ఆదరాభిమానాలను ప్రజల్లో కలిగించు. వారికి సకల సదుపాయాలను కలిగించు‘‘ అని అల్లాప్‌ా కు మొరపెట్టుకున్నారు. కొన్ని రోజులు వెంటతెచ్చుకున్న అన్నపానీయాలు అయిపోయాయి. పసిబడ్డతో సహా హాజిరా ఆకలిదప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలుపట్టడానికి రొమ్ముల్లో సైతం పాలు ఇంకిపోయాయి. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. పసిబిడ్డ ఏడుపు చూసి హాజిరా కన్నీరుమున్నీరయ్యారు. బిడ్డను అక్కడే నేలమీద పడుకోబెట్టి నీటికోసం, ఆహారం కోసం వెదుకుతూ అటూఇటూ తిరగసాగారు. సఫా అనే పేరుగల కొండను ఇక్కి లోయమొత్తం చుక్కనీటికోసం ఆశగా వెదికారు. నీటి జాడలేదు. మరోదిక్కున ఉన్న మర్వా కొండపైకి ఎక్కి చూశారు. ఇలా రెండు కొండల మధ్య ఏడుసార్లు తిరిగారు. నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది. ‘‘ఓ అల్లాప్‌ాu కరుణించు’’ అని వేడుకున్నారు. పసి బిడ్డ ఇస్మాయీల్‌ ఆకలి బాధతో ఏడుస్తూ తన కాళ్లతో నేలను కొడుతున్న ప్రదేశంలో స్వచ్ఛమైన నీటి ఊట అకస్మాత్తుగా ఉబికి వచ్చింది. తల్లి హాజిరా ఆ స్వచ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో పోశారు. బిడ్డ ఏడుపు ఆగింది. క ృతజ్ఞతతో ఆమె మనసు ఉప్పొంగిపోయింది. ఐదువేల సంవత్సరాలక్రితం నాటి జలధార నేటికీ ప్రవహిస్తూనే ఉంది. అదే పవిత్రజలం ‘జమ్‌ జమ్‌’. ఆ ఆనాడు వెలసిన ‘జమ్‌ జమ్‌’ ఊట నేటికీ కోట్లాది ప్రజల అవసరాలు తీరుస్తూంది. ఈ నీరు నిల్వ ఉంచినా చెడిపోదు. హజ్‌ యాత్రకు వచ్చిన వారు తమ తమ దేశాలకు ముస్లిములు మక్కా నుంచి ఈ నీరు తీసుకువెళుతుంటారు. ఆనాటి ఆ నిర్జనఎడారి ప్రాంతమే ఈనాడు సుందర మక్కా నగరం.
ఆ తరువాత కొంత కాలానికి దైవాదేశం మేరకు ఇబ్రాహీం మక్కా తిరిగొచ్చి భార్యా బిడ్డల్ని కలుసుకున్నారు. తనయుడు చిన్నారి ఇస్మాయీల్‌తో కలసి కాబా గృహాన్ని నిర్మించారు. తరువాత ఆయనకు మరో పరీక్ష ఎదురైంది. ఐతే ఇది మామూలు పరీక్ష కాదు. మానవ చరిత్ర కనీవిని ఎరుగని పరీక్ష. ఈసారి దైవం ఏకంగా కన్నకొడుకునే బలి చెయ్యమని కలలో ఆదేశించాడు. దివ్యఖుర్‌ఆన్‌ లో ఇబ్రాహీం త్యాగనిరతిని అల్లాప్‌ా ప్రస్తావించాడు.
’’మేము అతనికి ఒక సహనశీలుడ్కెన కుమారుడు కలుగుతాడనే శుభవార్తను అందజేశాము. ఆ బాలుడు అతనికి తోడుగా పనిచేసే వయస్సుకు చేరుకున్నప్పుడు (ఒకనాడు) ఇబ్రాహీమ్‌ అతనితో ఇలా అన్నాడు: ‘‘కుమారా! నేను నిన్ను ‘జిబప్‌ా’ (బలి) చేస్తున్నట్లుగా కలలో చూశాను. ఇక నీ అభిప్రాయమేమిటో చెప్పు.’’ అతను ఇలా అన్నాడు‘‘నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని నెరవేర్చండి. అల్లాప్‌ా సంకల్పిస్తే మీరు నన్ను సహనశీలునిగా చూస్తారు.’’ చివరకు వారు ఉభయులూ (దైవాజ్ఞను) శిరసావహించారు.’’
కొడుకు ఇస్మాయీల్‌ కూడా తండ్రికి తగ్గ తనయులు. దేవుడు కలలో చూపించిన ఆదేశాన్ని అమలు చేయాలని కొడుకు ఇస్మాయీల్‌ తండ్రికి ఎంతో నిబ్బరంగా చెప్పారు. ఇస్మాయీల్‌ తన దుస్తులు తొలగించారు. తల్లికి సలాములు చెప్పాలని చెప్పాలని తండ్రిని కోరారు. తన గుర్తుగా ఈ దుస్తులు తల్లికి ఇవ్వాలని చెప్పారు. బలిచ్చేటప్పుడు తన కాళ్లు చేతులు కట్టేయాలని చెప్పారు. ఇబ్రాహీం (అ) తన కత్తిని పదును పెట్టారు. కుమారుడిని గట్టిగా కౌగిలించుకుని రోదించారు. ఇస్మాయీల్‌ ను పడుకోబెట్టి కాళ్లూ చేతులు కట్టేశారు. బరువెక్కిన హ ృదయంతో కత్తిని లేపారు. పసి ఇస్మాయీల్‌ గొంతుపై కత్తి వేటు వేశారు. కానీ ఆ కత్తి గొంతును కోయలేదు. కత్తిని గట్టిగా కోయాలని ఇస్మాయీల్‌ అరుస్తూ చెప్పారు. ఇబ్రాహీం (అలై) అలాగే చేశారు. అయినా కత్తి గొంతును కోయలేదు. ఇబ్రాహీం ఆశ్చర్యపోయారు. ‘‘ఇబ్రాహీం నీవు కలను నిజం చేసి చూపించావు.మేము నీ విధేయతకు బహుమానం ప్రసాదిస్తున్నాము.’’ అన్నాడు అల్లాప్‌ా. అల్లాప్‌ా కు కావలసింది బలికాదు. ఆయన నిబద్ధతనే పరీక్షించదలిచాడు. ఇస్మాయీల్‌ కు బదులుగా బలివ్వడానికి స్వర్గంనుంచి పొట్టేలును పంపించాడు అల్లాప్‌ా. పొట్టేలును బలిచ్చారు. ఈ త్యాగానికి ప్రతీకగానే బక్రీదు పండుగను ముస్లిములు ఏటా జరుపుకుంటారు. ఆ నాడు ఆ తండ్రీకొడుకులు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ నేడు ముస్లిములు ఖుర్బానీ ఇస్తుంటారు. నాడు వారిద్దరు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దైవమార్గంలో పణంగా పెట్టారు. అలా ఖుర్బానీ ఇచ్చిన మాంసాన్ని పేదలకు పంచిపెడతారు. ఆ విధంగా పేదసాదలకు మాంసాహారం లభిస్తుంది.
కాబా నిర్మాణం..
ఇబ్రాహీం తన కుమారుణ్ణి చూసి చాలాకాలమయ్యింది. ఈసారి ఆయన అతి ముఖ్యమైన పని చేయవలసి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి ఆరాధనాలయాన్ని నిర్మించవలసిందిగా అల్లాప్‌ా ఆయన్ను ఆజ్నాపించాడు. మక్కా లోయలో ఈ ఆరాధనాలయం ప్రాచీన కాలంలో ఉండేది. అక్కడ జమ్‌ జమ్‌ బావి వద్ద తన కుమారుడు ఇస్మాయీల్‌ (అలై) బాణాలకు పదును పెట్టడాన్ని చూశారు. తండ్రీకొడుకులు ఒకరినొకరు చూసుకొని ఆనందంతో కౌగిలించుకున్నారు. అల్లాప్‌ా కాబా గృహాన్ని నిర్మించాలనే అల్లాప్‌ా ఆదేశాన్ని ఇబ్రాహీం తన కుమారుడికి చెప్పారు. ఇరువురూ కలిసి కాబా గృహం పునాదులను త్రవ్వసాగారు. ఇస్మాయీల్‌ రాళ్లను మోసుకుని వస్తుంటే ఇబ్రాహీమ్‌ వాటిని అమర్చసాగారు. కొంతకాలానికి నిర్మాణం రూపురేఖలు దిద్దుకుంది. ఆ విధంగా కాబాగృహం నిర్మించబడిరది. ఐదువేల సంవత్సరాలక్రితం ఇబ్రాహీం ప్రవక్త నిర్మించిన కాబా గృహం ప్రపంచ ముస్లిములకు పవిత్రమైన గృహంగా, ఆరాధనాలయంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిములు ఏ మూలన ఉన్నా కాబాగ ృహం వైపునకు తిరిగే నమాజు చేస్తారు. దాన్నే ఖిబ్లా అని అంటారు. హజ్‌ యాత్రలోని క్రతువులో భాగమైంది. ఏటా ముస్లిములు మక్కాలోని కాబాగృహాన్ని సందర్శించి ప్రదక్షిణలు చేయడం హజ్‌లో భాగమైపోయింది. అమ్మ హాజిరా (అలై) సఫా-మర్వా కొండల నడుమ మంచినీటికోసం ఏడు సార్లు ఎలా తిరిగారో అలా తిరగడమూ హజ్‌ యాత్రలో భాగమైంది. ఈ కాబా పుణ్యక్షేత్రంతో ఇబ్రాహీమ్‌ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఇక్కడ ఇబ్రాహీం నిలబడి నమాజ్‌ చేసిన చోటు ఉంది. ఖర్బానీ ఇచ్చిన ప్రదేశం ఉంది. ఇబ్రాహీం, ఇస్మాయీల్‌ త్యాగనిరతికి జ్ఞాపికగా ఇక్కడ జంతుబలిచ్చి పేదలకు తినిపించాలి. ఇబ్రాహీం జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఇబ్రాహీం త్యాగనిరతిని అలవర్చుకోవడమే బక్రీదు సందేశం.


SAKSHITHA NEWS