SAKSHITHA NEWS

బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద ఎమ్మెల్యే పర్యటన…

వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణ స్థలం పరిశీలిన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి జూనియర్ కాలేజి వద్ద రూ.1 కోటితో స్వర్గీయ శ్రీ కేఎం పాండు జ్ఞాపకార్థం నిర్మించే వొకేషనల్ కాలేజీ స్థలాన్ని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ టీఆర్ఎస్ నాయకులు మరియు ఇంజనీర్ తో కలిసి పరిశీలించారు. ఈ మేరకు కాలేజీ భనవం యొక్క ప్లాన్ చర్చించారు. డిగ్రీ కళాశాల తరగతులు కూడా ఈ అక్టోబర్ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో 8 గదులతో కూడిన కాలేజీ భవనం విద్యార్థులకు వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే ఇంజనీర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్, బొడ్డు వెంకటేశ్వర రావు, మాజీ జడ్పీవైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు లక్ష్మారెడ్డి, జయరాం, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, శ్రీకాంత్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కస్తూరి బాల్ రాజ్, వారాల వినోద్, చౌడ శ్రీనివాస్ రావు, సయ్యద్ రషీద్, మన్నె బాలేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS