బి.మఠం కానిస్టేబుల్ వెంకటరమణ సాహసం.. మహిళ సురక్షితం..

Spread the love

వై.ఎస్.ఆర్ జిల్లా….

బి.మఠం కానిస్టేబుల్ వెంకటరమణ సాహసం.. మహిళ సురక్షితం..

చీటిల వ్యాపారంతో నష్టపోయి బ్రహ్మం సాగర్ లో దిగి ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను సాహసోపేతంగా కాపాడి శభాష్..పోలీస్ అంటూ ప్రజల మన్ననలందుకున్న బి.మఠం పోలీస్ కానిస్టేబుల్ వెంకటరమణ..

బద్వేల్ పట్టణంలోని దూదేకుల వీధికి చెందిన జులేఖా(45) అనే మహిళ
చీటిల వ్యాపారంతో తీవ్రంగా నష్టపోయి బ్రహ్మంగారి సాగర్ రిజ్వాయర్ నీటిలో దిగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది….

దీంతో విధులు ముగించుకొని బ్రహ్మ సాగర్ వైపు వెళుతున్న బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ వెంకటరమణ నీటిలో ఆత్మహత్య చేసుకుంటున్న జులేఖా ను చూసి తక్షణం నీటిలోకి దూకి జులేఖాను రక్షించాడు….

అనంతరం జులేఖా ను పోలీస్ స్టేషన్ కు తరలించి బి.మఠం ఎస్.ఐ విద్యాసాగర్ కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సాహసోపేతంగా వ్యవహరించి తన తల్లి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్ వెంకటరమణ కు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం పోలీస్ శాఖకు రుణపడి ఉంటామన్నారు.

మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ వెంకటరమణ ను జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ప్రత్యేకంగా అభినందించారు. స్ఫూర్తిదాయక సేవలందించి జిల్లా పోలీస్ శాఖ ఔన్నత్యాన్ని మరోసారి చాటారని ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page