పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని,ఆధ్యాత్మికవేత్తలు..
-న్యాయసమ్మతితో 500 ఏళ్ల భారతీయుల కలను సాకారం చేసిన మహనీయులకు పాదాభివందనం చేస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని….
గుడివాడ
:
గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని శ్రీ కోదండ రామాలయం ముంగిట అయోధ్య శ్రీ రామ మందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ విజయోత్సవ మహా సభ సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. సభలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, ఎమ్మెల్యే కొడాలి నాని, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.తోలుత భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా”గంగాధర శాస్త్రి, భారతీ తీర్థ సన్మాన గ్రహీత శ్రీనివాస బంగారయ్య శర్మ, టిటిడి బోర్డు మాజీ సభ్యులు గుడిపల్లి బానుప్రకాష్ రెడ్డి హైందవ ధర్మ గొప్పతనంపై ప్రసంగించి, రామ మందిర నిర్మాణ ముఖ్య ఘటనలను వివరించారు.
ఆనంతరం సభికులను ఉద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. రామ మందిర నిర్మాణానికి జరిగిన ప్రయత్నంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరితో కలిసి మెలిసి జీవించాలని భావించిన పెద్దలు న్యాయమార్గాన్ని అనుసరించారన్నారు.అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఎవరికి ఇబ్బంది కలగకుండా రామ మందిర నిర్మాణం పూర్తి చేసిన మహానుభావులకు ఎమ్మెల్యే నాని పాదాభివందనం చేస్తున్నానని సభా వేదికగా చెప్పారు. హిందూ సాంప్రదాయ కట్టుబాట్లు, మనిషి మంచి మార్గంలో ఎలా జీవించాలన్న విషయాలపై గుడివాడ ప్రజలకు జ్ఞానం కలిగించేందుకు తమ సమయాన్ని వెచ్చించిన ఆధ్యాత్మికవేత్తలకు ప్రజల తరఫున ఎమ్మెల్యే కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. గుడివాడ నడిబొడ్డున ఇంత గొప్పటి కార్యక్రమం చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే నాని పేరుపేరునా అభినందించారు. ఈ సందర్భంగా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆధ్యాత్మికవేత్తలను ఎమ్మెల్యే కొడాలి నాని, మరియు నిర్వాహకులు దృశ్యాలువాలతో సన్మానించారు.
అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే నానికు ఆత్మీయ సత్కారం చేశారు.ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షకులు మండలి హనుమంతరావు, విశ్వహిందూ పరిషత్ గుడివాడ అధ్యక్షుడు బూరగడ్డ శ్రీనాథ్, ప్రముఖ వేద పండితులు చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు, సనాతన నాదోపాసకులు రఘునాధ శాస్త్రి, గుడివాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొర్ల శ్రీను, నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి చంటి, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ , విజయోత్సవ కార్యక్రమ నిర్వాహకులు సనాతన ధర్మా నాదోపాసకుల మరియు బృందముల సమైక్య సభ ప్రతినిధులు, వేలాదిగా హైందవ బంధువులు పాల్గొన్నారు.