SAKSHITHA NEWS

Attahasanga South Zone Wood Ball Competitions.

అట్టహాసంగా సౌత్ జోన్ వుడ్ బాల్ పోటీలు.
పోటీలను ప్రారంభించిన కైపా పద్మలత.

సాక్షిత న్యూస్ కర్నూలు జిల్లా

శనివారం కె.వి సుబ్బారెడ్డి కళాశాల ప్రాంగణంలో మొదటి సౌత్ జోన్ సీనియర్ స్త్రీ పురుషుల వుడ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా 17 వార్డ్ కార్పొరేటర్ కైపా పద్మలత హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని పలు క్రీడా పోటీలకు సుబ్బారెడ్డి కళాశాల వేదికగా నిలవడం హర్షించదగ్గ విషయమని తెలిపారు.

క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ పోటీలలో రాణించి విజేతలుగా నిలవాలని తెలిపారు. ప్రత్యేక అతిధి గా విచ్చేసిన శ్రీ లక్ష్మి క్రెడో పాఠశాల ప్రిన్సిపల్ టి. శ్రావ్య లక్ష్మి క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రీడలు ఆడటం వలన ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని క్రీడల ద్వారా పొందే ప్రశంస పత్రాల ద్వారా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ,

చిన్నప్పటి నుంచి క్రీడలు ఆడడం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా క్రీడాకారులకు తెలియజేస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి జోసెఫ్ లక్ష్యయ్య ప్రసంగిస్తూ వుడ్ బాల్ క్రీడ స్కూల్ గేమ్స్ లో కూడా చేర్చబడిందని,

త్వరలో రాష్ట్రస్థాయి వుడ్ బాల్ పోటీలు కర్నూలు నగరంలో నిర్వహించడానికి తమ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రముఖ డాక్టర్ రమేష్ పోటీల నిర్వహకుడు ప్రభాకర్ వివిధ రాష్ట్రాల కార్యదర్శులు కోచులు మేనేజర్లు క్రీడాకారులు హాజరయ్యారు


SAKSHITHA NEWS