SAKSHITHA NEWS

తిరుపతి రైల్వే స్టేషన్లో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

సాక్షిత : స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తియిన సందర్బంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా “హర్ ఘర్ తిరంగా” ప్రతి ఇంట్లో జండా పండగ చేసుకొనే విధంగా తిరుపతి రైల్వే స్టేషన్ సిబ్బంది అందరికి జాతీయ జెండాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

అత్యంత క్లిష్ట సమయాలలో ప్రపంచమే సంక్షేభంలో ఉన్న సమయంలో భారతీయులమైన మనం మన శక్తి, యుక్తులు, కష్టార్జితంతో మనల్ని మనం నిరూపించుకున్నాం. మన రాజ్యాంగం పట్ల, మన ప్రజాస్వామ్య సంప్రదాయాల పట్ల గర్విస్తున్నామని ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది భారతదేశం అని ఆయన అన్నారు.

తదుపరి రైల్వేస్టేషన్ లోని దక్షిణ భాగంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి పనులు వేగవంతం చేయాలనీ అధికారులకు సూచించారు. ఆలాగే రాయల చెరువు రోడ్డు గేట్ దగ్గర నిర్మాణంలో ఉన్న అండర్ బ్రిడ్జి పనులను పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి తో కలిసి స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, రైల్వే డి.ఎస్.పి శ్రీనివాస్, స్టేషన్ సి.ఐ మధుసూదన్, రేణిగుంట స్టేషన్ సి.ఐ సందీప్, రైల్వే ఇంజనీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS