నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
బాధిత కుటుంబానికి పరామర్శ
సాక్షి త ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రోడ్డు ప్రమాదం లో మరణించిన ఆశ వర్కర్ మాలోత్ విజయ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోని అండగా ఉండాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ డిమాండ్ చేశారు. ఉదయం మంగ్యా తండా నుంచి కేవి బంజారా గ్రామానికి విధులకు వెళ్తున్న క్రమంలో ఏనుకూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఆశా వర్కర్ విజయ అక్కడికి అక్కడే మరణించారు.భర్త రవి కి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ… ప్రభుత్వం స్పందించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఆశా వర్కర్ లకు పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా పది వేల రూపాయలు జీతం ఇవ్వాలని పని భారం తగ్గించి 8గంటలే పనిలో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ భర్త వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వం బరించి ప్రేవైట్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపా అధ్యక్షులు కొంటేముక్కుల నాగేశ్వరరావు, మారం కరుణాకర్ రెడ్డి , రబ్బానీ, వసీం, సయ్యద్ మహమూద్ తది తరులు పాల్గొన్నారు…