SAKSHITHA NEWS

సాక్షిత :శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ, పాపిరెడ్డి నగర్, ప్రగతి నగర్, హనుమాన్ నగర్ కాలనీ లలో లో రామాలయం శివాలయం ,సాయి బాబా దేవాలయం, హనుమాన్ నగర్ దేవాలయల ప్రాంగణంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేకపూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినం న ప్రజలు అందరూ సుఖ శాంతుల తో గడపాలని ఆకాంక్షించారు. అదేవిధంగా. శ్రీరామ నవమి, సీతా రామ కళ్యాణం.వివాహము ఎలా జరగాలో నేర్పి చూపించిన అవతారము శ్రీ రామ అవతారము. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి జరిగి ఉండవచ్చు. రామనామ వైభవము మాత్రము అలా ఉండిపోయింది. వశిష్ఠుడు ఇచ్చిన రామనామము ఎంతగొప్పది అంటే ర అన్న అక్షరము అష్ఠాక్షరీ మహా మంత్రములోని ప్రధానమైన బీజాక్షరము. మ కారము పంచాక్షరీ మహా మంత్రములో ఉన్న ప్రధానమైన బీజాక్షరము. రామ అన్నప్పుడు అగ్ని బీజము అమృత బీజము అనుసంధానము ఎవరు రామ నామమును చదువుతుంటే ర అనడమువలన అగ్నిచేత పాపములు కాలిపోతాయి. మ అన్నప్పుడు నోరు మూసుకుని మళ్ళీ పాపములు లోపలకు వెళ్ళే అవకాశము ఉండదు. రాముని ఉద్దేశించి అనకపోయినా శ్రీరామ అన్నా రామ అన్న నామమునకు అంత శక్తి ఉన్నది. ఎంత కాలము రామనామము చెప్పబడుతుందో రామాయణము ఎంత కాలము చదవబడుతుందో ఎంతకాలము రామచంద్రమూర్తిని మనము అనువర్తిస్తామో రాముడిని ఆదర్శముగా తీసుకుని బతుకుతామో అంతకాలము శ్రీరామ రాజ్యము విలసిల్లుతుంది. లోకము సుభిక్షముగా ఉంటుంది. రామచంద్రమూర్తి జీవితమును చెప్పుకుంటే చాలు. అందరికీ రామ భక్తి కలుగుగాక స్వామి మన చేత రామనామము పలికించుగాక రామును యొక్క బలము పెరుగుగాక. అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికి శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ , నాయి నేని చంద్రకాంత్ రావు, ఉట్ల చంద్రారెడ్డి, నాగేశ్వరరావు,ఎల్లం నాయుడు,విఠల్,గణపతి,రాము,టైల్స్ శ్రీను ,గడ్డం రాజేశ్వర్ రెడ్డి, ప్రసాద్, ధర్మారావు, దొడ్ల రాంరెడ్డి, కిరణ్, భగవంత రెడ్డి , నర్సింహులు ముదిరాజ్, చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనంతరములు, హన్మంత్ రెడ్డి, కనకా రెడ్డి, శరత్ రెడ్డి, నర్సిరెడ్డి, పాండు గౌడ్ , సత్యనారాయణ, శేఖర్ రెడ్డి మరియు ,కాలనీ అసోసియేషన్ సభ్యులు ,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS