SAKSHITHA NEWS

జిహెచ్ఎంసి అధికారిక అధ్యయన పర్యటనలో భాగంగా మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ మున్సిపల్ బోర్డు లోని వివిధ ప్రాతాలలో పారిశుధ్యం మరియు వ్యర్థాల నిర్వహణ లో అవలంభిస్తున్న విధి విధానాలను డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలతారెడ్డి తో, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ ,దొడ్ల వెంకటేష్ గౌడ్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , శ్రీమతి మాధవరం రోజాదేవి రంగారావు తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ లో స్వచ్ఛ గ్రామంగా పేరొందిన మావ్లీనాంగ్ లో పర్యటించడం జరిగిందని, ఆసియాలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందిన మావ్లీనాంగ్ లో గ్రామస్తులు పరిశుభ్రత కోసం అనుసరిస్తున్న విధి విధానాల గురించి వారిని అడిగి తెలుసుకోవడం జరిగిందని అదేవిధంగా మేఘాలయ, షిల్లాంగ్ మున్సిపల్ బోర్డు లోని వివిధ ప్రాతాలలో పారిశుధ్యం మరియు వ్యర్థాల నిర్వహణ లో అవలంభిస్తున్న విధి విధానాలను, పట్టణ అభివృద్ధి పద్ధతులు, పురపాలక సేవలపై అమలవుతున్నా ఉత్తమ పద్ధతులను సేకరించి, విజయవంతమైన పారిశుధ్య విధానాలను పరిశీలించి హైదరాబాద్ మహా నగరంలో అమలు పరిచేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు.


SAKSHITHA NEWS