మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సాక్షిత : నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాలను GHMC కమిషనర్ లోకేష్ కుమార్, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా శాంతికి చిహ్నం అయిన పావురాన్ని, బెలూన్ లను గాలిలోకి ఎగురవేశారు. సమన్వయ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ లో గెలుపొందిన విజేతలకు మంత్రి సర్టిఫికేట్ లను అందజేశారు. అనంతరం వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గాంధీ చిత్ర ప్రదర్శనను ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్ లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించిన అనంతరం విద్యార్థులు, FDC చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, MLA దానం నాగేందర్, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, FDC ED కిషోర్ బాబు, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు బసిరెడ్డి, కార్యదర్శి దామోదర ప్రసాద్, ఐ మ్యాక్స్ థియేటర్ నిర్వాహకులు రమేష్ ప్రసాద్ తదితరులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ, భగత్ సింగ్ వంటి అనేకమంది మహానీయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి చేసిన పోరాటాల తోనే బ్రిటీష్ పాలన నుండి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 22 వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా జరిపేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశ సమైక్యతను చాటే విధంగా ఇంటికో జాతీయ జెండా చొప్పున కోటి 20 లక్షల జెండాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ స్ఫూర్తి ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. 16 వ తేదీన ఏకకాలంలో ఎక్కడి వారు అక్కడే సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. 17 వ తేదీన రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులలో దేశభక్తిని పెంపొందింప చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయుల గురించి తెలియజేయడం కోసమే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు భాషలలో ప్రత్యేకంగా రూపొందించిన గాంధీ చిత్రాన్ని రాష్ట్రంలోని 563 స్క్రీన్ లలో విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను థియేటర్ ల వరకు తీసుకెళ్లడం, చిత్ర ప్రదర్శన అనంతరం తిరిగి వారిని ఇంటికిచేర్చే ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే చేసిందని వివరించారు.
……………….
మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Related Posts
హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి
SAKSHITHA NEWS హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మరియు మంచి నీటి సరఫరా మరియు UGD నిర్వహణ పై జలమండలి అధికారులు , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్…
క్రీడల్లో గెలుపోటములు సహజం..
SAKSHITHA NEWS క్రీడల్లో గెలుపోటములు సహజం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం మండలం:క్రీడల్లో గెలుపోటములు సహజం అని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపురం మండలం…