SAKSHITHA NEWS

Arogya Sri services suspended in AP

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌ పడనుంది. ఏపీలో ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్ లో కార్పొరేట్ వైద్య సేవలు ఈనెల 22 నుంచి నిలిపివేస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుతో పేదలకు ఉచితంగా ప్రైవేటు ఆసు పత్రుల్లో మెరుగైన వైద్యసే వలు అందిస్తున్నా మన్నారు.

ప్రభుత్వం ప్రైవేట్‌ ఆస్ప త్రులకు చెల్లించాల్సిన 1500కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకు ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాశారు.

సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేయాల్సి వస్తుందని ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రులు లేఖలో తెలిపాయి.


SAKSHITHA NEWS