SAKSHITHA NEWS

ఎన్టీఆర్ జిల్లా

కాలుష్య నివారణకు తగు చర్యలు చేపడతాం

షా బుఖారి బాబా దర్గా మసీదు ప్రాంగణాన్ని సందర్శించిన ‌ ఎన్ టి టి పి ఎస్ ఎన్విరాన్మెంట్ ఈ ఈ బాబురావు*

కొండపల్లి మున్సిపాలిటీ,

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హజ్రత్ సయ్యద్ షాబుఖారి దర్గా మసీదు పరిసర ప్రాంతమంతా ఎన్టీపీఎస్ కాలుష్యం వలన దర్గాకు మసీదుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదు మేరకు నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్, బాబురావు ఇతర అధికారులు షా బుఖారి బాబా దర్గా మరియు మసీదు ప్రాంగణం ఈరోజు పరిశీలించారు.

పొల్యూషన్ కారణంగా త్వరగా కు భక్తులు పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలుష్యంతో దర్గా ప్రాంగణమంతా నల్లగా అయిపోతుందని, మసీదులో కనీసం నమాజ్ చేసుకునేందుకు కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారని, సిబ్బందికి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ఈ ఈ కు విన్నవించుకున్నారు.

అదేవిధంగా వెంటనే ‌చెట్లు నాటించాలని, దర్గా మసీదు లో పనిచేసే సిబ్బందికి, ముతవల్లీలకు, ఇమామ్ లకు హెల్త్ కార్డ్ ఇవ్వాలని,షెడ్డు ఏర్పాటు చేయాలని చెట్లకు నీళ్లు వేయటానికి, పరిశుభ్రత చేయుటకు వర్కర్స్ ని కేటాయించాలని భక్తులు కోరారు.

స్పందించిన ‌ఈ ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని త్వరలోనే కాలుష్య నివారణ చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా, దర్గా ముతవల్లి షాజహాన్ బాబు, కాజా తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS