ఉమాదేవి వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు

Spread the love

Application to CM Relief Fund for Umadevi’s medical treatment

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కి చెందిన శ్రీమతి ఉమాదేవి వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF – ద్వారా మంజూరైన 22,000/- రూపాయలు విలువ గల CMRF చెక్కును బాధిత కుటుంబానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ,మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి అందచేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF చెక్కుల వివరాలు

1.మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కి చెందిన శ్రీమతి ఉమాదేవి వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF – ద్వారా మంజూరైన 22,000/- రూపాయలు గామంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు .

అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు,భగవాన్, కార్తిక్ రావు,రాంచందర్, హిమగిరి రావు, అల్లం మహేష్,చంద్రమోహన్ సాగర్,రామాకృష్ణ,చంద్రశేఖర్, విద్య సాగర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page