SAKSHITHA NEWS

తిరుపతి

మునిసిపల్ కార్పొరేషన్ కు 2023-24 మొదటి అర్ద సంవత్సరం కు చెల్లించాల్సిన ఆస్తి పన్నులపై వడ్డీ లేకుండా చెల్లచడానికి ఈ నెలాఖరు వరకే గడువుందని, పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు. జూలై 1 నుంచి పన్ను బకాయిలపై రూ.100కి రూ.2 వంతున వడ్డీ పడుతుందని కమిషనర్ హరిత తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ వారికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, ఖాళీ జాగా పన్నులు, నీటి చార్జీలు, భూగర్భ మురుగునీటి చార్జీలు, ఈ జూన్ నెల 30వ తారీఖు లోపు మొదటి అర్ధ సంవత్సరమునకు వడ్డీ లేకుండా చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పన్ను చెల్లింపుదారులందరూ వెంటనే పన్నులు చెల్లించవలసిందిగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ విజ్ఞప్తి చేసారు.


SAKSHITHA NEWS