SAKSHITHA NEWS

అపర భగీరధుడు బొల్లా బ్రహ్మనాయుడు
సాక్షిత : శాశ్వత త్రాగునీటి పథకానికి 161 కోట్లు రూపాయలతో పైపులను నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు .

దశాబ్దాలుగా వినుకొండ పట్టణపుర ప్రజలను పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 161 కోట్ల రూపాయల నిధులతో పైప్ లైన్ నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగిందని పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు మరియు పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మంచినీటి పథకం శంకుస్థాపనలో భాగంగా బుధవారం వినుకొండకు వచ్చిన ఆయన స్థానిక శివయ్య స్తూపం వద్ద శిలాఫలకాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక జాషువా కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించిన అపర భగీరధుడు మీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారని కొనియాడారు. నిరుపేదల సంక్షేమానికై వైసిపి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతున్నాయని అన్నారు. వైసిపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిరాధారణమైన విమర్శలు చేస్తున్నాయని, ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వినుకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నాడని ప్రజలు బ్రహ్మనాయుడు ని ఆదరించాలని కోరారు.

శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, వినుకొండ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని, అభివృద్ధి ని చూసి ఓర్చుకోలేక మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అసత్య ఆరోపణ చేస్తున్నారని అన్నారు.


SAKSHITHA NEWS