
మంగళగిరి:
నగరంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ గా వి రత్న నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం బెటాలియన్ కార్యాలయంలో రత్న కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత బెటాలియన్ సిబ్బంది నూతన కమాండెంట్ రత్నకు గౌరవ వందనం చేశారు.బాధ్యతలు స్వీకరించిన కమాండెంట్ రత్న ను పలువురు బెటాలియన్ అధికారులు, సిబ్బంది కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు.
