హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని భూములు), ట్యాక్స్ పేయర్లు, పొలిటికల్ లీడర్లకు సంబంధించిన భూములు ఉన్నట్లు తెలిసింది. వీరి భూములకు రైతుబంధు కట్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే రైతు భరోసా అమలు చేసే సమయానికి ఈ సీలింగ్ మరింత ఉంటుందని అధికారులు చెబుతుండం గమనార్హం. అయితే ఇప్పటి వరకు 84 శాతం మందికి రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేయగా 93 శాతం మందికి రైతుబంధు నిధులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP