మంచిర్యాల జిల్లా:
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందర శాల వద్ద గల నిర్మించిన అన్నారం బ్యారేజీను సందర్శించి మునిగిన పంట పొలాలను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని రైతులకు భరోసా కల్పించారు పంటలు మునగకుండా కరకట్టల నిర్మాణం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారుకమిషన్లు, కాంట్రాక్టర్లకు దోచు పెట్టేందుకే కాలేశ్వరం ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ చేపట్టారు
కాకా వెంకటస్వామి తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే 33 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతోందని చెప్పారుకెసిఆర్ కమిషన్లకు కక్కుర్తి పడి మేడిగడ్డ వద్ద కాలేశ్వరాన్ని నిర్మించి మంచిర్యాల,చెన్నూరు, మంథని భూపాలపల్లి నియోజకవర్గాల్లోని వేల ఎకరాల పంట పొలాలు కాలేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోవడానికి కారణమయ్యాడు
ఈ ప్రాజెక్టు లక్ష 25 వేల కోట్లను ఖర్చు చేసి కమిషన్ల ను దోచుకోవడమే కాకుండా కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనవంతుడుగా మార్చిండుగత బిఆర్ఎస్ పాలకులు బ్యాక్ వాటర్ వల్ల చెన్నూరు నియోజకవర్గం లో వేల ఎకరాల పంట పొలాలు నాలుగేళ్లుగా ముంపు గురైన ఒక్క పైసా నష్టపరిహారం ఇవ్వలేదు
కనీసం నష్టపోయిన రైతులను అప్పటి పాలకులు పరామర్శించిన పాపనా పోలేదుకేటీఆర్ కు ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడుకాలేశ్వరం పంపులను ఆన్ చెయ్యకపోతే 50,000 మందితో ధర్నా చేస్తామంటూ అవగాహన లేని మాటలను మాట్లాడాడుఇప్పుడు వచ్చి పరిస్థితి చూస్తే అన్నారం, ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్ళు ఎటు వెళ్తున్నాయో కనబడుతుంది
ఇరిగేషన్ పై అవగాహన లేని కేటీఆర్ మూర్ఖంగా మాట్లాడుతున్నాడుకాలేశ్వరం ప్రాజెక్టును కెసిఆర్ కుటుంబం ఏటీఎం మెషిన్ లా వాడుకుందికాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి కార్యచరణ చేసింది
కరకట్టల నిర్మాణానికి ప్రయారిటీ ఇచ్చింది
ప్రెజర్ కమిటీ మరింత అధ్యయనం చేసి కరకట్టల నిర్మాణంపై పూర్తి నివేదిక తయారు చేసే పనిలో ఉందిబ్యాక్ వాటర్ తో నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని రైతులకు భరోసా కల్పించారుఅంతకుముందు రైతులు మాట్లాడుతూ కరకట్టల నిర్మాణం కానీ తమ పంట పొలాలు, తమ గ్రామమైన సుందరశాలను ముంపు గ్రామంగా ప్రకటించి మార్కెట్ వాల్యూ ప్రకారం పరిహారం ఇప్పించేందుకు ఎమ్మెల్యే వెంకటస్వామి చొరవ చూపాలని కోరారు
బిఆర్ఎస్ పాలకులు నష్టపోయిన తమను ఎప్పుడు కూడా పరామర్శించకపోగా నయా పైసా పరిహారం ఇవ్వలేదని ఎమ్మెల్యే ఎదుట వాపోయారుఅప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ కు తమ కష్టాలు చెప్పుకుంటే కాలేశ్వరం ద్వారా మీ ప్రాంతం వండ్రుకు గురవుతుందంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిండుగతంలో పనిచేసిన అధికారులు ఇక్కడ వాస్తవ పరిస్థితులను చెప్పకుండా దాచిపెడుతున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు