
చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అధిక మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న జగ్గయ్యపేట పోలీసులు
సుమారు 30 లక్షలు విలువైన 218 కేజీల గంజాయి మరియు రెండు కార్లు స్వాధీనం.
రాష్ట్ర ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి ఎస్. గారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా అనేది లేకుండా చేయడానికి పటిష్టమైన నిఘాతో పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది.
ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్ వి రాజ శేఖర బాబు ఐ. పి ఎస్ గారికి రాబడిన సమాచారం మేరకు రూరల్ డి. సి. పి శ్రీ కె ఎం.మహేశ్వర రాజు ఐ. పి. ఎస్. గారి సూచనలతో నందిగామ ఏ. సి. పి. ఎ.బి. జి. తిలక్ గారి పర్యవేక్షణ లో జగ్గయ్యపేట ఇన్స్పెక్టర్ శ్రీ పి. వెంకటేశ్వర్లు గారు, వత్సవాయి ఎస్. ఐ. గారు వారి సిబ్బంది కలిసి ఈరోజు చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో వాహన తనిఖీలను నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రెండు కార్లను మరియు నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 218 కేజీల గంజాయిని, గంజాయి తరలించడానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుల వివరాలు
- అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం, బెన్న భూపాలపట్నం గ్రామానికి చెందిన బియ్యాల నాగేశ్వరరావు (33సం )
- అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం, బెన్న భూపాలపట్నం గ్రామానికి చెందిన అనుమాల ప్రసాద్ (55సం )
- అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మరుపాక గ్రామానికి చెందిన తలారి రమణ (29సం )
- నర్సీపట్నం మండలం, పాత బైపు రెడ్డి పాలెం గ్రామానికి చెందిన బైపు రెడ్డి ఎల్లయ్య (31సం ) ఈ నలుగురు నిందితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సాలు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాదులో గంజాయికి మంచి గిరాకీ ఉంది, వారికి దగ్గరలోని ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి చాలా తక్కువ రేటుకు లభిస్తుంది వాటిని తీసుకొని హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ ఎక్కువ రేటు అమ్మితే అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని నిర్ణయించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమీపంలోని ఒరిస్సా బోర్డర్ తండాలలో వారి వద్ద నుండి తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి వాటిని రెండు కార్లలో సర్దుకొని నర్సీపట్నం నుండి బయలుదేరి హైదరాబాద్ వెళుతున్న సమయంలో నగర పోలీస్ కమిషనర్ గారికి రాబడిన పక్కా సమాచారంతో జగ్గయ్యపేట సిఐ గారు వారి సిబ్బందితో కలిసి ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 30 లక్షలు విలువైన 218 కిలోల గంజాయిని,గంజాయి తరలిస్తున్న రెండు కారులను స్వాధీనం చేసుకొని, అరెస్టు చేయడం జరిగింది. దీనిపై జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పి వెంకటేశ్వర్లు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
