SAKSHITHA NEWS

సాక్షిత : అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి, భరోసాకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రక్షాబంధన్ సందర్భంగా మంత్రికి వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తాను ప్రత్యేకంగా తయారు చేసిన ఇండిపెండెన్స్ రాఖీని కట్టారు. అనంతరం మంత్రి దంపతులకు స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా మేయర్ మంత్రి ఆశీస్సులు తీసుకున్నారు.


SAKSHITHA NEWS