రాస్తారోకోకి సహకరించిన స్థానిక ప్రజలు, వాహనదారులు
40 వ రోజు కుచేరిన అంగన్వాడీల సమ్మె
నాలుగవ రోజుకు చేరినవిజయవాడలో
అంగనవాడి నేతలు చేపట్టిన నిరవధిక దీక్షలు
నిరవధిక దీక్షలతో క్షీణిస్తున్న అంగన్వాడి నేతల ఆరోగ్యాలు
ఉలుకు పలుకు లేని రాష్ట్ర ప్రభుత్వం
దళితులు,
బలహీనవర్గాలు, గిరిజనలు అధిక శాతం ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఇదోరకం అంటరానితనం కాదా
ఈప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండితనం వీడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావాలి
అంగన్వాడీలను ఉద్యోగాల నుండితొలగిస్తామంటూ చేస్తున్న తాటాకు చప్పట్లకు అంగన్వాడీలు ఎవరు భయపడరు
అంగన్వాడీల జోలికొస్తే రాష్ట్ర ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే
సిఐటియు నేతల హెచ్చరిక
అంగన్వాడీల ఆందోళన ప్రారంభమై 40 రోజులు గడుస్తున్న పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం రవి, ఎంభాగ్యరాజు అన్నారు
అంగన్వాడీ టీచర్లు ఆయాలు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు అధిక శాతం మంది ఉంటే వీరి సమస్యలు పరిష్కరించకుండా వీరిని బెదిరింపులకు గురి చేయటం అంగన్వాడీలపై దుష్ప్రచారాన్ని చేస్తుండటం ఇదోరకం అంటరానితనం కాదా అని వారు ప్రశ్నించారు
ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని వారు హెచ్చరించారు
రాస్తారోకోలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తుళ్లూరు మండల అధ్యక్ష కార్యదర్శులు స్వర్ణ లత, ఎస్ కే కరీ మూన్ యూనియన్ నాయకులు అన్నామని, రజిని, విజయలక్ష్మి ,శంషాద్ సునీత ,పద్మ, తులసి, సుచరిత, అరుణ సిఐటియు నాయకులు పేరం బాబురావు తదితరులు నాయకత్వం వహించారు