SAKSHITHA NEWS

anganwadi అంగన్వాడి కేంద్రాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి……. *జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

*సాక్షిత వనపర్తి :
అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సౌకర్యాలు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

  కలెక్టరేట్  కాన్ఫరెన్స్ హాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాట్ల పై జిల్లా సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష  సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కడెక్కడ మరుగుదొడ్లు, తాగునీటి వసతి అవసరం ఉందో గుర్తించి వాటిల్లో వేగంగా నిర్మాణాలు ప్రారంభించాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్పందిస్తూ 154 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, 50 కేంద్రాల్లో తాగునీటి వసతి, 10 కేంద్రాల్లో అప్గ్రేడషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఆయా కేంద్రాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా, జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వారం గడువులోపు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. వేగవంతంగా, నాణ్యతగా పనులు పూర్తి చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మి బాయి, పంచాయతీ రాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, సీడిపీఓ లు, సూపర్ వైజర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

anganwadi

SAKSHITHA NEWS