SAKSHITHA NEWS

రూ.3 వేలకు పెంపుతో లబ్ధిదారుల్లో ఆనందం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

మైలవరం మండలంలో పెంచిన పింఛన్ పంపిణీ ప్రారంభం.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జనవరి 3:

సామాజిక భద్రతా పింఛను సొమ్ము పెంపుతో అవ్వాతాతలు, వితంతువుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈనెల నుంచి ప్రభుత్వం రూ.3 వేలు అందజేస్తుండటంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. నేరుగా వారికి పంపిణీ చేస్తుండటంతో తామంతా సీఎం జగనన్నకు రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మైలవరం మండలంలో 9947 మంది వివిధ రకాల పింఛన్ల లబ్ధిదారులకు ప్రతినెలా రూ2,98,41,000లు కోట్లు లబ్ది చేకూరనుంది.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ మందికి ఎక్కువ మొత్తంలో పింఛను సొమ్ము పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఇదొక చరిత్ర అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పింఛను సొమ్ము పంపిణీని మైలవరం మండలానికి సంబంధించి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం పట్టణంలోని ఎస్.వి కళ్యాణమండపంలో ప్రారంభించారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ

సామాజిక పింఛన్లు అవ్వాతాతల ఆర్థిక అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా చూశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి ఇప్పటి వరకు పింఛన్లు పెంచుకుంటూ హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వలంటీర్ వ్యవస్థ నెలకొల్పి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ సొమ్ము అందిండం చారిత్రాత్మకమన్నారు.

గడపవద్దకే నేరుగా పథకాలు..

ఎన్నడూలేని విధంగా ఎంతో పారదర్శకంగా పింఛన్లు ఇస్తున్న ఏకైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. పక్క రాష్ట్రాల్లో పింఛన్, ఇతర పథకాల కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి క్యూ కడుతున్న సందర్భాలు ఉన్నాయని, ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. నేరుగా గడప వద్దకే పథకాలు అందుతున్నాయన్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 01 03 at 5.32.06 PM

SAKSHITHA NEWS