డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ
హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఘన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ధర్మాసనం ముందు విచారణ
టెట్ మరియు డీఎస్సీ కి మధ్య కేవలం ఒక్కరోజు సమయాన్ని కేటాయించటం చట్టరీత్యా విరుద్ధమన్న హైకోర్టు
టెట్ రిజల్ట్ తర్వాత అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ తీసుకునే విధానంపై 2018 లో ఇచ్చిన ప్రభుత్వ నిబంధనలను పాటించలేదన్న హైకోర్టు
కేవలం ఒక్క రోజు వ్యవధిలో పరీక్ష నిర్వహించాలి అనటం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటమే అని అభిప్రాయపడిన హైకోర్టు
గతంలో బి.ఎడ్ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించడంపై కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం స్టే విధించింది
గతంలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు వాదనను వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ మరియు శరత్చంద్ర
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్టే విధించడంతో డీఎస్సీ నిర్వహణ ఆగిపోయినట్లేని న్యాయ నిపుణుల అభిప్రాయం.