SAKSHITHA NEWS

వైసీపీ ప్రభుత్వాన్ని కూలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుందని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, బోగపురం మండలం, పోలేపల్లి వద్ద యువగలం ముగింపు సభ ఏర్పాట్లలో ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకు యువగళం పేరుతో పెద్దపీట వేశారన్నారు. యువ గలానికి అశేష ప్రజానీకం మద్దతు పలికి దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక పాలనపై నేడు ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న వైసీపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు…

WhatsApp Image 2023 12 19 at 5.56.58 PM

SAKSHITHA NEWS