చాపల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

చాపల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

SAKSHITHA NEWS

An unidentified dead body was found in Chapala pond

చాపల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిది : సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామ (వెంకటాపురం) చేపల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యంమైంది. ఇదే చెరువులో చేపలు పట్టి విక్రయించారు. సాయంత్రం చెరువు వద్ద కాలకృత్యాలకు వెళ్ళిన కొంతమంది యువకులకు నీటిలో శవం కనిపించడంతో భయభ్రాంతులకు గురై అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాత్రి సమయంలో తెలిసిన వారితో చెరువులో శవం ఉందన్న విషయాన్ని తెలియజేశారు. ఉదయం సమాచారం తెలుసుకున్న స్థానిక సూర్యాపేట రూరల్ ఎస్సై బాలునాయక్ వారి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ట్రాక్టర్ సాయంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం గుర్తుపట్టే పరిస్థితి లేదని నీటిలో పడి సుమారు మూడు నాలుగు రోజులు అవుతున్నట్టుగా శవం ఉందన్నారు. దర్యాప్తు చేసి పూర్తి సమాచారం అందిస్తామని అన్నారు.

WhatsApp Image 2024 06 25 at 12.44.22

SAKSHITHA NEWS