SAKSHITHA NEWS


Ambedkar statue in Baswapur village, Koheda mandal, Siddipet district

సాక్షిత : సిద్ధిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ ,మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కామెంట్స్ :

బస్వాపూర్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కృషి చేసిన అంబేద్కర్ సంఘాలకు గ్రామస్తులకు శుభాకాంక్షలు.

అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు ఒక దళితులు మాత్రమే ఆరాధిస్తారనొద్దు. అలా అనుకోవడానికి వీల్లేదు. నేటి సమాజంలో దేశంలో ఎన్ని కులాలు మతాలు కలిసి మెలిసి ఉండడానికి నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని చెప్పుకోక తప్పదు.

అంబేద్కర్ ప్రధానంగా అన్ని వర్గాలు బాగుపడాలని, అన్ని వర్గాలు ముందుకు రావాలని.., ముందు చూపుతో స్వీయ అనుభవంతో చేసిన ఆలోచనలు.

నేటి విద్యా లోకం, నేటి సమాజం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే వీధి దీపాలలో చదువుకొని విదేశాల కెళ్ళి, మన దేశానికి రాజ్యాంగం రాసి ఈ స్థాయికి వచ్చారంటే ఈ సమాజానికి దేశానికి ఆయన ఎంతగానో ఆదర్శవంతం.

ప్రపంచంలో అత్యంత విగ్రహాలు కలిగిన మహా నేత అంబేద్కర్

సమాజసేవ, సమాజ హితం, సమాజం కోసమై ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో పెద్దగా చెప్పుకునేది అంబేద్కర్ గురించి విద్య అనేది ఎంత ముఖ్యమో సమాజానికి చాటి చెప్పిన మహానేత అంబేద్కర్ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి స్ఫూర్తినిచ్చిన మహానాయకుడు అంబేద్కర్.

2014-15 లో గురుకులాలు రాష్ట్రంలో 298 మాత్రమే ఉండేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని 1,021 కు పెంచారు. 2014లో 1,12,667 మంది విద్యార్థులు మాత్రమే ఉండేది. ఇవాళ గురుకులాల్లో చదువుకునే వారి సంఖ్య 5,40,366 కి పెరిగింది.

చదువుల మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు రేపు సమాజానికి రాష్ట్రానికి సంపదగా మారి నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి జాతి సంపదగా ఉపయోగపడతారని సీఎం కేసీఆర్ విద్య పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

తెలంగాణలో మహిళల కోసం 50 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం.

మహిళల గురించి గొప్పగా ఆలోచించి ఉన్నత స్థాయిలో ఉంచాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఆడపిల్ల చదువు కోసం ఖర్చు చేస్తుంది.
అదే విధంగా ఆడపిల్ల పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి అందిస్తుంది. పెళ్ల తర్వాత కాన్పు కోసం కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 12 వేల రూపాయలు ఇచ్చి ఇంటికాడ ఆటో దిగబెడుతున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం.

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషులోనే బోధించడం ప్రారంభించి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య ఇంగ్లీష్ బోధన అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.

మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రతి పాఠశాలను బాగు చేసుకోవడం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విజ్ఞానాన్ని అందించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్, ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించాం.

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నేనెప్పుడూ తోడుంటా. ఎల్లవేళలా శాయశక్తులా కష్టపడతానని మంత్రి భరోసా ఇచ్చారు.


SAKSHITHA NEWS