alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్
alluri అల్లూరి సీతారామరాజు జీవితం అందరికి ఆదర్శ ప్రాయమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం అల్లూరి చిత్రపటానికి పూలమాలతో అలంకరించి, అధికారులు, కార్పొరేటర్లు కొబ్బరి కాయలు కొట్టి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ మాట్లాడుతూ మన్యం ప్రజల స్వాతంత్ర్య కోసం బ్రిటీష్ వారిపై పోరాడిన అల్లూరి స్పూర్తిని అందరూ గుర్తుంచుకున్నారని, స్వాతంత్ర్య కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్పొరేషన్ ఉధ్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జయంతిని మనమంతా స్మరించుకోవడం సంతోషమని, ఈ సందర్భంగా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ అల్లూరి సీతారామరాజు విగ్రహం తిరుపతి నగరంలో లేదని, ఆయన విగ్రహం ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆర్.సి.మునికృష్ణ, కోటూరి ఆంజినేయులు, వరికుంట్ల నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, రెవెన్యూ ఆఫిసర్లు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app