SAKSHITHA NEWS

All the occupied lands will be distributed to the poor

కబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాం
అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేస్తాం
ప్రజల చెంతకే మీ శీనన్న
కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి


ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి..వాటిని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండా, చిన్నతండా, వరంగల్ క్రాస్ రోడ్, జలగం నగర్ లలో నిర్వహించిన ప్రజల చేంతకే మీ శీనన్న కార్యక్రమాలకు హాజరయ్యారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇంటి స్థలం సమస్య ఎవరికీ రానీయకుండా చూస్తామని అన్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి తానే కాబట్టి కొద్ది రోజుల్లోనే పాలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా రాబోయే మూడేళ్లలో అర్హులందరికీ మంజూరు చేస్తామని అభయమిచ్చారు.
మీ ఇంటి పెద్ద కొడుకుగా సమస్యలు తీరుస్తా..
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పేదోడి కష్టం తీర్చే ప్రభుత్వం రావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని.. ప్రజల ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కాంగ్రెస్ పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనం గోడు విన్నానని, ఆ సమస్యలకు నేరుగా పరిష్కారం చూపాలనే ప్రజల చెంతకు వెళుతున్నానని అన్నారు. మీ ఇంటి పెద్ద కొడుకుగా ప్రభుత్వ ఫలాలు అందించే బాధ్యత చూస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదలందరికీ లబ్ధి కలిగేలా పాలన సాగుతోందని అన్నారు.

WhatsApp Image 2024 06 13 at 17.35.54

SAKSHITHA NEWS