భీమవరం: ఎంపీ రఘురామకృష్ణరాజు నాలుగేళ్ల తర్వాత స్వస్థలానికి వస్తున్నారు. దిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ర్యాలీగా భీమవరం బయలుదేరారు..
మరోవైపు రఘురామ రాక నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. వైకాపా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ.. ”నాలుగేళ్ల తర్వాత భీమవరం వెళ్లడం సంతోషంగా ఉంది. నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ అందించిన సహకారం మరవలేనిది. అభిమానులు, తెదేపా, జనసేన నాయకులు చూపిన ప్రేమ మరవలేను. సొంత వారెవరో పరాయి వారెవరో అర్థమవుతోంది. మా నానమ్మ చనిపోయినప్పుడు కూడా నేను మా ఊరు రాలేదు” అని అన్నారు..