న్యాయవాది విజయ రెడ్డి హత్య ను ఖండిస్తూ వరుసగా మూడో రోజు సూర్యాపేట న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరణ
13 ఆగస్టు తేదీన ఎల్లమ్మ గూడెం నివాసి తిప్పర్తి మండలం నల్లగొండ జిల్లాలో నల్లగొండ బార్ అసోసియేషన్ సభ్యులు ఎల్లమ్మ గూడెం సర్పంచ్ భర్త న్యాయవాది విజయ రెడ్డి గారిని కొంతమంది దుండగులు అమానుషంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా ఈరోజు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత సత్యనారాయణ పిల్లే యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు.
ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొండ్రాల అశోక్ మాట్లాడుతూ విజయ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపినారు. ప్రజాస్వామిక వాదులు, అన్ని రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, మంత్రులు ఖండించాలని కోరినారు ,.న్యాయవాదుల పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని , హత్య చేయబడిన విజయ రెడ్డి కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరినారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల పరిరక్షణ కోసం న్యాయవాదుల పరిరక్ష చట్టాన్ని వెంటనే తీసుకురావాలని సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొండ్రాల అశోక్ డిమాండ్ చేశారు
నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సినేపల్లి సోమేశ్వర్, న్యాయవాదుల సహకార సొసైటీ అధ్యక్షులు నాతీ సవేందర్ కుమార్, తల్లమల్ల హసేన్, జటంగి వెంకటేశ్వర్లు, గుంటూరు మధు , కొంపెల్లి లింగయ్య, దాసరి వెంకటేశ్వరరావు, ఏడిండ్ల అశోక్,అనుముల పూరి సైదులు ఎల్లయ్య రాజ్, బోలెద్దు వెంకటరత్నం, పెండెం వాణి,కోక రంజిత్ కుమార్ పంతంగి కృష్ణ, ఇబ్రహీం, భద్రయ్య , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు