SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 19 at 6.23.15 PM

హుస్నాబాద్ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజు నాయక్

సాక్షిత – హుస్నాబాద్ (సిద్దిపేట బ్యూరో చీఫ్ ): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించకుండా ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు తినుబండారాలను అమ్ముతున్న సినిమా థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని సినిమా థియేటర్లను మూసివేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజు నాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక హుస్నాబాద్ లోని వెంకటేశ్వర కళామందిర్ సినిమా థియేటర్లను రాజు నాయక్ రమేష్ తిరుపతి కలిసి థియేటర్లను సందర్శించారు.

అనంతరం రాజు నాయక్ మాట్లాడుతూ సినిమా థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి కూర్చోడానికి కుర్చీలు లేక బాత్రూంలో సరైన సౌకర్యాలు లేక తినుబండారాల రేట్లు ఎంఆర్పి కంటే అధికంగా అమ్ముతూ ప్రేక్షకుల దగ్గర దోపిడీ చేస్తున్న థియేటర్లపై తక్షణమే అధికారులు స్పందించి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు థియేటర్లను తనిఖీలు నిర్వహించకుండా థియేటర్ యాజమాన్యాల దగ్గర ఆశ పడడం వల్లనే అధికారులు నిద్ర మత్తులో ఉండడం వల్లనే థియేటర్ యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా త్రాగే నీరు కూర్చునే కుర్చీలు సరిగా లేకున్నా డబ్బులు వసూలు చేయడం ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తుంగలో తొక్కుతూ విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సెన్సార్ బోర్డ్ అధికారులు జిల్లా కలెక్టర్ ఆర్డీవో ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు నిర్వహించి ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.


SAKSHITHA NEWS