SAKSHITHA NEWS

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోగల ప్రొఫెసర్ జయశంకర్ సార్ సెంటర్ లో, ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరణించిన విద్యార్థులను స్మరిస్తూ ఈ సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1952 లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రాల వీలినాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ ఆలీ కమిషన్ కు నివేదిక ఇచ్చాడు. కేసీఆర్ కి సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. జయశంకర్ సార్ తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. తెలంగాణ భావజాలం కలిగినవారని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి స్వరాష్ట్ర సాధన కోసం, నిధులు నియామకాల కొరకు అలుపెరగని పోరాటం చేసిన మహానీయులని, నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన సిద్ధాంతకర్త, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి దాత అని కొనియాడారు. వారి ఆశయాల మేరకు మనందరం నడుచుకోవాలని, సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలలో మనందరం భాగస్వాములై బంగారు తెలంగాణ దిశగా మనందరం తోడ్పాటు అందించాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, రామ్ చందర్, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, గోవింద చారి, బసవయ్య, జి. రవి యాదవ్, గోపాల్ యాదవ్, రవీందర్, కిషోర్, మేడ్చల్ శ్రీనివాస్, పవన్ కుమార్, గోపికృష్ణ, సాయి కుమార్, మున్యా నాయక్, గఫార్, అజీమ్, శ్రీనివాస్ చారి, యాదగిరి, రజిని, సౌజన్య, భాగ్యలక్ష్మి, జయ, నర్సింలు, సుధాకర్, ముంతాజ్ బేగం, సత్తార్ బాయ్, అలీమ్, సత్యనారాయణ, నహీమ్, మాణిక్యం చారి, దివాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జమ్మయ్య, యాదగిరి, రామచందర్, నాగేష్ అప్పా, ఏరియా కమిటీ మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు, తెరాస నాయకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS