The accused in the POCSO case was sentenced to 20 years in prison and fined 55,000
పోక్సో కేసులోని నిందుతుడికి 20 సం,రాలు జైలు శిక్ష, 55 వేలు జరిమానా
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందుతుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 55 వేల రూపాయల జరిమానా విధిస్తూ ..1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు జడ్జి కె. ఉమదేవి గురువారం తీర్పు వెలువరించారు. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం, చిమ్మపూడి గ్రామం, ఎస్సీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కంపాటి కార్తీక్ (20 సం,,) అదే గ్రామంలో ఉంటున్న 6 ఏళ్ల చిన్నారిపై కన్నేశాడు. 2023 మార్చి 5 న సాయంత్రం ఆటోలో ఇంటి నుండి ఎత్తుకెళ్లి ఆభంశుభం తెలియని బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ లో 2023 మార్చి 6 బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో క్రైమ్ నెంబర్ 54/2023. అండర్ సెక్షన్ : 366ఏ,376 ఐపీసీ సెక్షన్ 5 ఆర్/డబ్ల్యు 6 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన రఘునాథపాలెం పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో నిందుతుడి పాత్ర వుండటంతో పకడ్బందిగా సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు రుజువు కావడంతో 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు జడ్జి దోషి గా నిర్దారించి 20 ఏళ్లు జైలు శిక్ష, 55 వేల రూపాయలు జరిమానా విధించారు. నిందుతులకు శిక్ష పడటంలో కీలకపాత్ర పోషించిన దర్యాప్తు అధికారి ఏసీపీ భస్వారెడ్డి, భరోసా లిగల్ అధికారి యం. ఉమారాణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.శంకర్, కోర్టు కానిస్టేబుల్ జి.రవి కిషోర్ ,కోర్ట్ లైజనింగ్ అధికారులు హెడ్ కానిస్టేబుళ్లు కె.శ్రీనివాసరావు, మోహన్ రావు,హోంగార్డు అయూబ్ లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.