ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రమాదంలో : ఒకరికి తీవ్ర గాయాలు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దిబ్బగూడెం గ్రామానికి చెందిన అర్జున్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దమ్మపేట కోర్టు సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం వద్ద ఉన్న స్థానికులు అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ప్రాణాపాయం ఏమీ లేదు గట్టిగా దెబ్బలు తగిలాయని వివరించారు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి పక్కనే పడడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి ఇంకొంచెం ముందుకు పడుంటే కరెంటు స్తంభానికి తగిలి మరింత గాయాల పాలు అయ్యేవాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,స్థానికులు పాల్గొనడం జరిగింది.
