హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ కాలనీ పార్క్ అభివృద్ధిలో భాగంగా నీరు కోసం బోరు వేస్తున్న సందర్భంగా బోరు బండి కి కాలనీ వారితో కలసి పూజ చేసి ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, హైదర్ నగర్ లో చెరువులు పార్కులు అభివృద్ధిలో భాగంగా నేడు సమత నగర్ పార్కులో బోరు పని నా చేతుల మీదుగా ప్రారంభించటం అదృష్టంగా భావిస్తున్నాను, అలానే వ్యాయామం మన దినచర్యలో భాగం చేసుకోవాలని, పిల్లల్లు పెద్దలు ముఖ్యంగా ఆడవారు రోజు ఒక అరగంట వాకింగ్ చేయడం వలన మన ఆరోగ్యం మన చేతిలో ఉండేలా చూసుకోవాలని చెప్పడం జరిగింది, అలానే ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని కార్పొరేటర్ గారు పేర్కొన్నారు. అలానే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిథుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, పార్కు వాకర్స్, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
