మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను కెపిహెచ్బి కాలనీ రమ్య గ్రౌండ్

Sakshitha news

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను కెపిహెచ్బి కాలనీ రమ్య గ్రౌండ్ లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరయ్యారు.చిరంజీవి కి శుభాకాంక్షలు అభిమానులకు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ స్వయంకృషితో తనదైన నటనతో సినీ రంగంలో పద్మ విభూషణ్ స్థాయికి ఎదిగిన నిత్య కృషివరుడు చిరంజీవి అని కొనియాడారు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంలోనూ తనకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రోత్సహించిన చిరంజీవి యువత లోని టాలెంట్ ని గుర్తించి వారికి అవకాశాలను కల్పించడంలోనూ చిరంజీవి ఎంతో ముందుంటారన్నారు. తన ట్రస్టు ద్వారా రక్తదానం నేత్రదానం చేయడం ద్వారా ఎంతోమందికి ప్రాణదానం కంటి చూపును కల్పించడం తో సమాజానికి తన వంతు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న చిరంజీవి యువతకు ఆదర్శప్రాయుడనీ రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చు రాజు, గాలి బాలాజీ, లక్ష్మయ్య, పట్లోళ్ల నాగిరెడ్డి , గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి దినేష్ ,గంధం రాజు, నరసింహారావు, ఫణి కుమార్, బచ్చు మళ్ళీ, పి ఆర్ నాయుడు, శివ చౌదరి, కామినేని వాసు ,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.