ఇందిరమ్మ చీరలను నిలవ చేయడానికి గోదాంలను సిద్ధం చేసిన : డి ఆర్ డి ఏ విద్యా చందన
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు
రానున్న ఇందిరమ్మ చీరలను నిల్వ చేయడానికి 6 గోదాంలను సిద్ధం చేసినట్లు డి ఆర్ డి ఎ ఎం. విద్యా చందన తెలిపారు. కొత్తగూడెం,మణుగూరు, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఈ గోదాంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈనెల 22 నుండి 30వ తేదీ వరకు చీరల పంపిణీకి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గోదాంలో 30 వేల నుండి 60 వేల వరకు చీరలను నిల్వ చేయనున్నామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

