ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటూ కాలయాపన సరికాదు – జగదీష్ రెడ్డి
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: కమిషన్‌ల పేరుతో కాలయాపన ఇంకా ఎన్ని రోజులు కొనసాగిస్తా కాంగ్రెస్ పార్టీ డైవర్సన్ పాలిటిక్స్ చేయటం ద్వారా ప్రజలను ఇబ్బంది పట్టిస్తోందనీ సార్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అనేక రకాల సమస్యలు సృష్టిస్తున్నారు. కరెంట్, కాళేశ్వరం మీద ప్రచారం, కమిషన్‌లు, ట్యాపింగ్ కేసులు ఇవన్నీ అబద్ధమని ఇప్పటికే తేలిపోయింది. ఈ ఫార్ములా… ఆ ఫార్ములా అంటూ మళ్లీ కాలయాపన మొదలుపెట్టడం ఏమిటీ? గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయినా బాధ్యతతో కొనసాగించాలి. ప్రభుత్వ ఆదాయ-వినియోగ బాధ్యత ఒక నిరంతర ప్రక్రియ; ఈ విషయంలో మీ జ్ఞానం ఏమిటో ప్రజలకు స్పష్టమైపోయింది. ఈ కేసుల విషయంలో మోసపూరిత మిలాకతలు, డ్రామాలే జరుగుతున్నాయని నేను చూస్తున్నాను. గ్రూప్-1 వ్యవహారంలో మీరు చేస్తున్న డ్రామాలు బయటపడిపోయాయని మూలాల తెలియజేశారు. కేటీఆర్ ఇది లొట్టపిస్ కేసు అని చెప్పడం ద్వారా మీ మనస్తత్వం ఎందుకు కనిపిస్తోందో ప్రజలకు అర్థమైంది. నిర్మాతలుగా మీరే ఉంటే, ఈ రెండు ఈ ఫార్ములా… ఆ ఫార్ములా అంటూ సంవత్సరాల పాలనలో అవసరమైతే మిమ్మల్ని వందసార్లు జైలుకి పంపొచ్చు. కానీ ప్రజలతో చేసిన మోసానికి ప్రచారంతో సొల్పరాదు; వారి ఆవేశాన్ని మీరు చూస్తున్నారా? మీడియా ప్లాట్‌ఫాం పొందవచ్చు, కానీ ప్రజల మనసుల్లో స్థానం కొనలేరు. రాష్ట్రంలో రైతులు, మహిళలు ఎంత ఇబ్బందిలో ఉన్నారో, యువత ఎంత కోపంగా ఉన్నారో మనం చూస్తున్నాం. హాస్టళ్లలో విషాహారంతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు — ఆ బాధితుల ఆత్మలు మీ చుట్టూ తిరుగుతాయి. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా పని చేయాలి. కెసిఆర్ ను తరచుగా విమర్శించడం, కేసులు పెట్టతామనీ బెదిరించడం ఇవన్నీ చిల్లర మాటలు. మీ డైవర్సన్ ఫార్ములానే ఇది పని చేస్తుండొచ్చు. రైతులు యూరియాకు ఒకచోటికే వెళుతూ పడి బాధలో ఉన్నారు; వారి శాపనార్దాలు ఎప్పటికి కక్కనివ్వలేరు ప్రజల దృష్టిలోనూ, అధిష్టాన దృష్టిలోనూ మీరు ద్రోహిగా మిగిలిపోతారు. ఇక ఒక విషయం స్పష్టం: కేసును సిబిఐకి అప్పగించడం ద్వారా మీ మోడీతో బలమైన సంబంధం బయటపడింది. ‘మోడీతో మీ బంధం’ ప్రజల దృష్టిలో కూడా స్పష్టమైంది. ఈ డ్రామాలు, డైవర్సన్ పాలిటిక్స్ టిఆర్ఎస్ ను తీసుకెళ్లలేవు. తెలంగాణ ప్రజలను ఎవ్వరూ మార్చలేరు ఇదే నిజం.” అని గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
