SAKSHITHA NEWS

జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు కు తగిన స్థలం కేటాయించాలని కలెక్టర్ ను కోరిన……. రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి

అంతర్జాతీయ స్థాయి హాకీ స్టేడియం ఏర్పాటు పరిశీలన

సాక్షిత వనపర్తి

 జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు తగిన స్థలం కేటాయించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికారక సంస్థ చైర్ పర్సన్  కె. శివసేన రెడ్డి జిల్లా కలక్టర్ ను కోరారు. 
    బుధవారం సాయంత్రం స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి కలక్టర్ ఛాంబర్ లో కలక్టర్ ఆదర్శ్ సురభినీ కలిశారు. 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్ స్థాయి వరకు స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని అందుకు సరిపడ కనీసం 25 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా కోరారు. 

   స్పందించిన కలెక్టర్ వనపర్తి జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనువుగా  ఉన్న ప్రభుత్వ భూములను గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా చూపించారు. వనపర్తి మండలం  పెబ్బేరు రోడ్ లో ఉన్న నాచహళ్ళి స్థలాన్ని, అయ్యవారి పల్లి వద్ద ఉన్న స్థలాన్ని, పోలేపల్లి, నాగవారం స్థలాలను చూపించారు. 
 అనంతరం నాగవరం మెడికల్ కళాశాల వద్ద ఉన్న స్థలాన్ని సందర్శించిన చైర్ పర్సన్ ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అనువుగా ఉందని కనీసం 25 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. 
   అనంతరం హాకీ స్టేడియాన్ని, ఇండోర్ స్టేడియాన్ని సందర్శించారు.  అంతర్జాతీయ స్థాయిలో హాకీ స్టేడియం నిర్మాణానికి ఏమైనా అవకాశం ఉన్నదా అని పరిశీలించారు. 

స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, అదనపు కలక్టర్ లోకల్ బాడిస్ సంచిత్ గంగ్వార్, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ , యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు చైర్ పర్సన్ వెంట ఉన్నారు.


SAKSHITHA NEWS