SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా
దోర్నాల మండలము అయినముక్కల లోని క్రైస్ట్ చర్చి నందు గుడ్ ఫ్రైడే ఆరాధన ఘనముగా జరిగింది.సర్వమానావాళి పాపముల పరిహారార్థమై పరలోకమునుండి భూమి మీద కి యేసుక్రీస్తు నరుడిగా వచ్చి పరిశుద్ధముగా జీవించి ప్రజలందరికి పాప క్షమాపణ సంతోషం, సమాధానం, రక్షణనిచ్చుటకు కల్వరి లో సిలువపై మరణించారని సంఘకాపరి బి.యన్ అగస్టీన్ భక్తులను ఉద్దేశించి ప్రభోధించడం జరిగింది. యేసుక్రీస్తు కల్వరి సిలువపై పలికిన ఏడు మాటలు మరియు యేసుక్రీస్తు ప్రేమ ప్రవచనాలు ప్రపంచములోని ప్రజలందరిని చాలా ప్రభావితం చేసి చెడు మార్గంలో నడిచేవారిని మంచి మార్గంలోనికి నడిపించాయని దోర్నాల మండల ఏపిపిఫ్ ప్రెసిడెంట్ బుట్టి.దిలీప్ కుమార్ భక్తులకు తెలియజేయడం జరిగింది.అనంతరం క్రైస్ట్ చర్చి సంఘ సభ్యులు యేసు సిలువలో పలికిన ఏడు మాటలలోని గూడార్ధములు వివరించడం జరిగింది.గుడ్ ఫ్రైడే ఆరాధన కి ఉపవాసం తో విచ్చేసిన భక్తులకు పలహారం మరియు తేనీరు ఇచ్చి అందరి నిమిత్తం సంఘకాపరి బి.యన్ అగస్టీన్ ప్రార్థనలు చేయడం జరిగింది.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యేసుక్రీస్తు ని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం జరిగింది. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకి దర్శి మండల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాటి చెన్నయ్య, ఆర్డీటి గ్రూప్ ఆర్గనైజర్ సుక్కా శ్రీనివాస్ మరియు సంఘపెద్దలు పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS