విద్యార్థులకు రెండవజత ఏకరూప దుస్తులను త్వరగా పంపిణీచేయాలి…….. జిల్లాకలెక్టర్ ఆదర్శ సురభి
అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై సమీక్ష
సాక్షిత వనపర్తి
జిల్లా లోవిద్యార్థులకు రెండవ జత ఏకరూప దుస్తులను త్వరగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యా శాఖ, గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
విద్యార్థులకు ఇవ్వాల్సిన రెండవ జత ఏకరూప దుస్తులు, అమ్మ ఆదర్శ పాటశాల పనుల పై సమీక్ష నిర్వహించారు.
మొదటి జత ఏకరూప దుస్తులు ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి చేరినాయా అని అధికారులను ప్రశ్నించారు.
మొదటి జత దుస్తులు అందరికీ చేరాయని, రెండవ జత దుస్తులు ఒకటి రెండు మండలాలు తప్ప దాదాపు శాతం కుట్టించడం పూర్తి చేసి పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సమాధానం ఇచ్చారు.
వెంటనే ప్రతి విద్యార్థికి రెండవ జత ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అమ్మ ఆదర్శ పాటశాల పనుల పై సమీక్ష
అమ్మ ఆదర్శ పాటశాల కింద కొన్ని మిగిలిపోయిన పాఠశాలలో పనులను త్వరగా పూర్తి చేయాలని, వందశాతం పూర్తి అయిన వాటికి బిల్లులు సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్, జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, ఆర్డీవో పద్మావతి, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు, ఆయా సంక్షేమ శాఖల అధికారులు, మండల విద్యా అధికారులు, తదితరులు పాల్గొన్నారు .