
రోడ్లు, రోడ్ల విస్తరణకు సంబంధించిన సమస్యలపై నివేదికలు సమర్పించాలని ఆదేశించిన………………….
జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
*సాక్షిత వనపర్తి :
జిల్లాలోని వివిధ రోడ్లు, రోడ్డు విస్తరణకు సంబంధిన సమస్యలు ఉంటే నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మధ్యాహ్నం కలెక్టర్ తన ఛాంబర్ లో రోడ్లు భవనాల ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ తో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో రోడ్లు మరమ్మతులు, రోడ్డు విస్తరణకు ఉన్న ఆటంకాలు, ఇబ్బందుల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వయా బిజినేపల్లి హైదారాబాద్ రోడ్డు, పాన్ గల్ రోడ్డు, పెబ్బేరు రోడ్డు, మరమ్మతులు, విస్తరణ పనులకు ఉన్న ఇబ్బందులు, ఆటంకాలపై నివేదిక ఇస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. చిన్న చిన్న ఆటంకాలను అధిగమించి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన సమస్యలు ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, రోడ్లు భవనాల శాఖ కార్యనిర్వహక ఇంజనీరు దేశ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, టౌన్ ప్లానింగ్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
