డ్యూటి లో ఉన్న కానిస్టేబుల్ పై ఇసుక ట్రాక్టర్ డ్రైవరు దాడి
సాక్షిత మోతే మండలం : అక్రమ ఇసుక తరలింపును అరికట్టడానికి మోతే ఎస్. ఐ అజయ్ కుమార్ మోతే మండల తహశీల్దార్ సంయుక్తంగా కూడలి గ్రామ శివారులోని కూడలి వాగు వద్ద పిక్కెట్ ఏర్పాటు చేశారు. అట్టి పిక్కెట్ లో ప్రతి రోజు 24 గం. లు ఒక పోలీస్ కానిస్టేబుల్ మరియు ఒక GPO అధికారి ఇసుక అక్రమ రవాణా జరగకుండా సూర్యాపెట-ఖమ్మం జిల్లాల మధ్య పిక్కెట్ విధులు నిర్వహిస్తారు. అదే విధముగా తేదీ. 20.04.2026 నాడు మోతే పోలీస్ కానిస్టేబుల్ కృష్ణం రాజు, కూడలి GPO సుధాకర్ కలిసి కూడలి వాగు వద్ద పిక్కెట్ డ్యూటి నిర్వహిస్తున్నారు. అదే రోజు రాత్రి సుమారు 08.00 గం.ల సమయములో కాకరవాయి నుండి కూడలి వైపుకు వస్తున్న ఇసుక లోడ్ ట్రాక్టర్ ను డ్యూటి లో ఉన్న కానిస్టేబుల్ ఆపగ అట్టి ట్రాక్టర్ డ్రైవరు తన ట్రాక్టర్ ను ఆపకుండా అతి వేగంగా నడిపాడు ట్రాక్టర్ ను కానిస్టేబుల్ తన బైక్ పై ఛేదించి ఆపి ఇసుక రవాణా కు సంబంధించి కాగితాలు ఆడగగా అతను విఫలమయ్యాడు.
అట్టి సమయములో అట్టి ట్రాక్టర్ డ్రైవరు తనతో పాటు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కలిసి డ్యూటి లో ఉన్న కానిస్టేబుల్ విధులను అడ్డగించి కానిస్టేబుల్ ను చేతులతో కొట్టి దాడి చేసి కింద పడవేసి అక్కడి నుండి ట్రాక్టర్ తో పారిపోయారు. వెనుక నుండి కారు లో ఒక వ్యక్తి వచ్చి తాను సోలిపురం గ్రామ సర్పంచ్ అని ఇసుక ట్రాక్టర్ ఎందుకు ఆపుతున్నావ్ అని దురుసుగా ప్రవర్తించినాడు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న మోతే ఎస్. ఐ అజయ్ కుమార్ విచారణ జరిపి కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినారు. అట్టి ముగ్గురు వ్యక్తుల పేర్లు తెలుసుకొనగా 1. భూక్యా మధు(ట్రాక్టర్ డ్రైవరు) గ్రామం. రాయకుంటా తండా, 2. భూక్యా శ్రీకాంత్ (ట్రాక్టర్ డ్రైవరు కు సహాయంగా వచ్చిన వ్యక్తి), 3. నునవత్ అశోక్ (సోలిపురం సర్పంచ్). కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన మోతే ఎస్. ఐ అజయ్ కుమార్.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY