100 రోజుల కార్యక్రమం ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న..కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారనగర్, లింగంపల్లి విలేజ్, హుడాట్రేడ్ సెంటర్, రైల్ విహార్ కాలనీ, రామయ్య నగర్ కాలనీ, వెంకట్ రెడ్డి కాలనీలలో చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నెలకొన్న పలు సమస్యలపై తారనగర్ తుల్జభవాని టెంపుల్ వద్ద కార్పొరేటర్ శేరిలింగంపల్లి, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ GHMC రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తదితర కాలనీల అసోసియేషన్ సభ్యులు, స్థానికవాసులు విచ్చేసి వారి కాలనీలో నెలకొన్న సమస్యల గురించి తెలియచేసి వినతిపత్రం అందచేశారు. కార్పొరేటర్ సానుకూలంగా స్పందించి వెంటనే తదితర సమస్యలపై చర్యలు చేపట్టి సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ప్రత్యక్షంగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ డిపార్ట్మెంట్ AMHO నగేష్ నాయక్, SS జలంధర్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ AE సునీల్, మెడికల్ డిపార్ట్మెంట్ స్వామి, ఏంటమలజీ డిపార్ట్మెంట్ AE కిరణ్, పోలీస్ శాఖ అధికారులు, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, హబీబ్ భాయ్, తారనగర్ వార్డ్ మెంబర్ కవిత గోపాల కృష్ణ, శ్రీనివాస్ గౌడ్, రవి యాదవ్, బుచ్చిరెడ్డి, డిఎస్ రావు, అజీమ్, గోపాల్ యాదవ్, సుభాష్ రాథోడ్, రహీం, సుధాకర్, రాంచందర్, రాజరెడ్డి, వెంకట రమణ, రాజేష్, నిరంజన్ చారీ, శ్రీనివాస్ రావు, రమేష్, శశి కిరణ్, రవి, సురేష్, రాజు, వనజ, దశరథ్, ఇంతియాజ్ జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.