ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం

SAKSHITHA NEWS

A resounding victory in the Andhra Pradesh assembly elections

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పొందిన పవన్ కళ్యాణ్‌కి అతని వదినమ్మ, చిరంజీవి భార్య సురేఖ ఒక గొప్ప బహుమతిని ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సురేఖ ఆయనకు అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు. సురేఖ స్వయంగా పెన్నును పవన్ కళ్యాణ్ జేబులో పెట్టగా, ఆయన ఎంతో సంతోషించారు. అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర వున్న పెన్నును తీసి చూపించారు. ‘ఇది కూడా అట్టిపెట్టుకో’ అని సురేఖ అన్నారు. ఇప్పుడు ఒక వైపు నుంచి చిరంజీవి, మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వచ్చారు. ఈ నలుగురూ కలసి ఒక మెమరబుల్ ఫొటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ వదిన, అన్నయ్య’’ అంటూ చిరంజీవి వీడియోను ముగించారు. పవన్ కళ్యాణ్‌కి సురేఖ్ అందించిన మోంట్‌బ్లాంక్ పెన్ను ఖరీదు ఎంత వుంటుందో తెలుసా… దాదాపు 2 లక్షల 75 వేల రూపాయలు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page