సాక్షిత :- పల్నాడు జిల్లా
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు.
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 51 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన ఉప్పుటూరు వెంకటరావు గత నాలుగు సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ స్మార్ట్ మీటర్ల సబ్ కాంట్రాక్ట్ కొరకు చాగంటి కృష్ణ అనే వ్యక్తి ద్వారా మద్దపాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఖాతాకు
10 ,00,000/- రూపాయలు మరియు నరసరావుపేట పట్టణంలో గల నవయుగ ఫ్యామిలీ రెస్టారెంట్ నందు మరో 13,00,000/- రూపాయలు మొత్తంగా 23 లక్షల రూపాయలు ఇవ్వగా సదరు వ్యక్తులు ఎలక్ట్రిక్ మీటర్లు సబ్ కాంట్రాక్టు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాని ఎస్పీ ని కలిసి న్యాయం చేయవలసిందిగా అర్జీ ఇవ్వడం జరిగింది.
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల సుబ్బాయమ్మ సంవత్సరం క్రితం తన అవసరాల నిమిత్తం తనకు గల రెండు సెంట్ల ఇంటి స్థలమును తన గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తికి తనకపెట్టగా సదరు రాజశేఖర్ మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గాను ఫిర్యాదు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన ఉన్నవ రాంబాబు ఖాతా నందు 13,22,389/- రూపాయలు ఉండగా అతని ఖాతాను హ్యాక్ చేసి 11,50,000/- వేల రూపాయలను డ్రా చేసినట్లు అంతట డబ్బులు ప్రిన్స్ కుమార్ సింగ్ ఖాతా నందు ఉన్నట్లు కావున ఫిర్యాదు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
శావల్యాపురం మండలం మతుకుపల్లి గ్రామానికి చెందిన ఏటుకూరి యోగయ్య కు గల ఇద్దరు కుమారులు ఆస్తిని వ్రాయించుకుని ఏటుకూరి యోగయ్య కు అన్నం పెట్టకుండా ఇంటి నుండి గెంటి వేసినారని కావున తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన రావుల ఉదయలక్ష్మి కు 15 సంవత్సరాల క్రితం శ్రీను అను అతనితో వివాహం అయినట్లు, వారికి ఇద్దరు సంతానం అయినట్లు అంతటి ఫిర్యాదు చెడు వ్యసనాలకు బానిస అయి సదరు ఉదయలక్ష్మి ను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని సదరు విషయమై ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
కేరళకు చెందిన తంగాచేన్ వలయతే అను అతను ఆత్మకూరు అడ్డరోడ్డు వద్ద సెయింట్ మార్టిన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నట్లు,
M.బాలకృష్ణ అను వ్యక్తి ఎంపీ ఫండ్స్ నుండి స్కూలు కు స్కాలర్ షిప్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి తంగాచెన్.వలయతే నుండి 7,36,000 తీసుకొని మోసం చేశాడని ఎస్పీని కలిసి న్యాయం చేయవలసింది గా అర్జీ ఇవ్వడమైనది.
చిలకలూరిపేట మండలం
కట్టుబడివారి పాలెం గ్రామానికి చెందిన అద్దేపల్లి రాజ్యలక్ష్మి హైదరాబాదు కు వెళుతూ తనకు గల రెండు ప్లాట్లను అమ్మమని ఆరు సంవత్సరాల క్రితం గుర్రపుశాల రామకృష్ణారెడ్డి కి చెప్పగా సదరు వ్యక్తి ఆ స్థలాలను అమ్ముకొని ఫిర్యాది కి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఫిర్యాదు తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
బొల్లాపల్లి మండలం గండిగనుమల తండా కు చెందిన వాంకడావత్ భోజ్య నాయక్ సుమారు రెండు సంవత్సరాల క్రితం ఎడాపలపాటి దుర్గారావు అను వ్యక్తి PET ఉద్యోగం ఇప్పిస్తాను అనగా దుర్గారావు కు 2,50,000/- లక్షలు ఇచ్చినట్లు అదేవిధంగా మరో ఇద్దరి వద్ద కూడా ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసినందుకు గాను తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు భోజన ఏర్పాట్లను చేసినారు.