వికారాబాద్ జిల్లా ప్రజావాణిలో ప్రజలసమస్యలు ,పరిస్కరించే ,కొత్త కలెక్టర్ ఇన్నేళ్లకు వచ్చాడు.

Spread the love

సాక్షితవికారాబాద్ జిల్లా : ప్రజల సమస్యలు అనేకం ఉంటాయి, అందులో ముఖ్యంగా భూముల సమస్యలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి తీసుకవచ్చి, పాత పట్టా పాస్ పుస్తకాలు తీసి వేసి, సీఎం కెసిఆర్ ,వాటి స్థానం లో కొత్త పాస్ పుస్త కాలు, పాత వాటిలో ఉన్న సర్వే నంబర్లు, భూములు, కొత్త వాటిలో కూడా రావాలి,కానీ తహసీల్దార్ కార్యాలయం లోణి ధరణి ఆపరేటర్లు మరియు తహసీల్దార్ మాట్లాడు కొని కొన్ని, ఆపరేటర్లు కొన్ని,ఉదా!!పాత వాటిలో ఉన్నవి 5-00 ఎకరాలు ఉంటే కొత్త వాటిలో 3-00ఎకరాలు ఎక్కించారు. అంటే ఒక రైతు భూమి మరో రైతు పాస్ పుస్తకం లో చేరిచ్చినారు, అంతే కాదు సుమారుగా 150 -200 సంవత్సరాలనుండి సాగు చేసుకుంటూ భ్రతుకుతున్న, రైతుల భూములు అసైన్ మెంటు, అడవి భూము కొత్త పాస్ బుక్ లో, అట్టి భూములు సర్వే నంబర్లు,లేకుండా చేశారు.

గత 7,8 సంవత్సరాలనుండి, రైతులు తహసీల్దార్ ఆఫిస్ల చుట్టూ, తిరిగిన కూడా పట్టించు కున్న నాథుడే లేరు, MLA లు మంత్రులు చూస్తాం చేస్తాం అంటున్నారే కానీ, చేసేవారు లేకపోయారు, ఫారెస్ట్ భూములు ఆసైన్ మెంటు భూములన్నారు కదా, అని ఫారెస్ట్ DFO కు అడిగితే మేము పలానా,సర్వే నంబర్లు ఫారెస్ట్ భూములవిఅని,తహసీల్దార్ ఆఫీస్ కు లెటర్ ఇచ్చామా? మాకు సంబంధం లేదు MRO మాయ జాలం మేము ఏమి చేయలేము, అంటున్నారు.భాధితులు ఎవరికి చెప్పుకోవలెనో,చెప్పిన చేయడం లేదు, తహసీల్దార్. RDO ఆఫీస్ లలో జరిగే ప్రజావాణి లలో దరఖాస్తులు ఇచ్చి, వేసారిపోనారు.వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ ఆఫీస్ భవనం ప్రారంభం ఐనా తదుపరి ప్రస్తుత జిల్లా కలెక్టర్ , తహసీల్దార్ ఆఫీస్ లలో పెండింగ్ లలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిస్కారం చేయాలి, లేకుంటే తగిన చర్యలు తీసుకున భడును, అని ఎపుడైతే కలెక్టర్ సీరియస్ ఐనారో, పనులు జరుగుతున్నవి.కానీ పనులు ఎమున్న కూడ జిల్లా కలెక్టర్ ప్రజావాణి లో ఇవ్వండి పరిష్కరించభడును పిలుపుతో తమ సమస్యలు పరిస్కారం చేసే కలెక్టర్ ఇన్నేళ్లకు వచ్చినాడని, ప్రజవాణి కీ భారులు, భారులు గా క్యూ లైన్లో దరఖాస్తులు ఇస్తున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page